#NBK111:బాలయ్య బర్త్ డే ట్రీట్!

5
- Advertisement -

గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ, మాస్ యాక్షన్ స్పెషలిస్ట్ గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న భారీ చిత్రం #NBK111 ఇప్పటికే మ్యాసీవ్ బజ్ క్రియేట్ చేస్తోంది. ‘వీరసింహారెడ్డి’ వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత ఈ కాంబినేషన్ మళ్లీ రిపీట్ కావడంతో అంచనాలు తారాస్థాయికి చేరుకున్నాయి. పవర్‌ఫుల్ యాక్షన్, భారీ స్థాయి మేకింగ్ తో రూపొందుతున్న ఈ చిత్రాన్ని వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై నిర్మాత వెంకట సతీష్ కిలారు అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.

బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా జూన్ 10న ఈ చిత్రానికి సంబంధించిన ఓ భారీ అప్డేట్‌ను విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ఈ మేరకు విడుదల చేసిన పోస్టర్ ఆకట్టుకుంటోంది. భారీ ఎన్‌బీకే అక్షరాలు ఇనుప గొలుసులతో బంధించినట్లుగా కనిపిస్తూ, బాలయ్య పవర్‌ను ప్రజెంట్ చేస్తున్నాయి. “No More Vintage, Only New Age” అనే ట్యాగ్‌లైన్ బాలకృష్ణను సరికొత్త అవతారంలో చూపించబోతున్న సంకేతాలు ఇస్తోంది. పోస్టర్‌లో కనిపిస్తున్న బుల్లెట్ విజువల్స్, జూన్ 10 తేదీతో కలిపి అభిమానుల్లో మరింత ఆసక్తిని పెంచుతున్నాయి.

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ముంబైలో శరవేగంగా జరుగుతోంది. ప్రధాన తారాగణం పాల్గొంటుండగా, కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.ఇటీవల మంచు మనోజ్ పుట్టినరోజు సందర్భంగా ఆయన కూడా ఈ చిత్రంలో భాగమవుతున్నట్లు ప్రకటించారు. కథలో కీలకమైన, పవర్‌ఫుల్ పాత్రలో మనోజ్ కనిపించనున్నారు.

Also Read:వచ్చే ఏడాది పాదయాత్ర చేస్తా:కేటీఆర్

మాస్ ఎంటర్‌టైనర్లను తెరకెక్కించడంలో తనదైన ముద్ర వేసిన గోపీచంద్ మలినేని, మరోసారి హై-వోల్టేజ్ యాక్షన్‌తో పాటు బలమైన భావోద్వేగాలతో కూడిన కథను సిద్ధం చేశారు.మిగిలిన నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలోనే మేకర్స్ ప్రకటించనున్నారు.నటీనటులు: నందమూరి బాలకృష్ణ, మంచు మనోజ్

సాంకేతిక సిబ్బంది:
రచన, దర్శకత్వం: గోపీచంద్ మలినేని
నిర్మాత: వెంకట సతీష్ కిలారు
బ్యానర్: వృద్ధి సినిమాస్
PRO: వంశీ-శేఖర్
మార్కెటింగ్: వాల్స్ & ట్రెండ్స్

- Advertisement -