KTR:తెలంగాణ OG కేసీఆర్

8
- Advertisement -

దేశ భక్తి, పోరాటాల గురించి మేము పవన్ కళ్యాణ్ దగ్గర నేర్చుకోవాల్సిన అవసరం లేదు అన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. మీడియాతో మాట్లాడిన కేటీఆర్… నటుడిగా అభిమానిస్తాము, సోదరుడిగా ఇంటికి వస్తే బిర్యానీ పెడతాము కానీ మా రాజకీయాల్లో పెత్తనం చేస్తామంటే ఊరుకోము అన్నారు. మొన్ననే అంత కష్టపడి విడిపోయాము కదా మళ్లీ మీ పెత్తనం ఎందుకు? అని ప్రశ్నించారు.

తెలంగాణ కచ్చితంగా ఈ భూమిపుత్రుల జాగీరేనని…పవన్ కళ్యాణ్‌కు కౌంటర్ ఇచ్చారు కేటీఆర్. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ను తెలంగాణలో ప్రజలే అడ్డుకున్నారు…జనసేన కొత్తగా పోటీ చేసేది ఏంది.. 2023లో మొన్న మున్సిపల్ ఎన్నికల్లో కూడా పోటీ చేశారు కదా..అప్పుడు ప్రజలే మిమ్మల్ని అడ్డుకున్నారు అన్నారు.

పవన్ కళ్యాణ్ గుర్తుపెట్టుకోవాలి.. ముమ్మాటికీ తెలంగాణ ఇక్కడున్న నాలుగు కోట్ల మంది జాగీరు…ప్రాంతీయ వాదం ఉగ్రవాదం కంటే ప్రమాదమని పవన్ కళ్యాణ్ అంటున్నాడు ..మరి పొట్టి శ్రీరాములు మద్రాస్ నుండి ఆంధ్ర వేరుపడాలని 58 రోజుల పాటు ఆత్మబలిదానం చేసుకున్నారు కదా అది కూడా ప్రాంతీయ వాదం అంటారా చెప్పాలన్నారు. ప్రాంతీయ వాదం అంటే తెలంగాణకి రావాల్సిన పెట్టుబడులు గుజరాత్‌లో పెట్టుకున్నారు.. మరి జాతీయ వాదం ముసుగులో చేస్తున్న ఆర్ధిక ప్రాంతీయ వాదం కరెక్టేనా ..మోడీ కేవలం గుజరాత్‌కి పీఎంగా వ్యవహరించడం కరెక్టేనా పవన్ కళ్యాణ్ చెప్పాలన్నారు.

Also Read:ఇది రాచరికం కాదు..రబ్రీపై సీఎం!

తెలంగాణ OG కేసీఆర్ అని గుర్తు చేసిన కేటీఆర్… బాల్క సుమన్ పొరపాటుగా ఆ మాటలు అన్నరని తెలిపారు.

- Advertisement -