TMC మాదే..మమతకు రెబల్స్ షాక్!

3
- Advertisement -

పశ్చిమ బెంగాల్ అధికార పార్టీ అయిన తృణమూల్ కాంగ్రెస్ (TMC) లో తీవ్ర రాజకీయ సంక్షోభం నెలకొంది. టీఎంసీకి చెందిన తిరుగుబాటు ఎమ్మెల్యే రీతాబ్రతా బెనర్జీ బుధవారం పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ (శాసనసభ) కి చేరుకోవడంతో రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. అసెంబ్లీ ప్రాంగణంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తన వెనుక అధికార పార్టీకి చెందిన సుమారు 50 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని సంచలన ప్రకటన చేశారు.

మమతా బెనర్జీ నాయకత్వంపై అసంతృప్తితో ఉన్న కొందరు కీలక నేతలు రీతాబ్రతా బెనర్జీతో టచ్‌లోకి వెళ్లినట్లు తెలుస్తోంది. అసెంబ్లీలో తగినంత మంది ఎమ్మెల్యేల మద్దతు తనకు ఉందని, పార్టీలో అంతర్గతంగా ఉన్న నిరంకుశత్వానికి వ్యతిరేకంగా తాము గళం విప్పబోతున్నామని ఆయన స్పష్టం చేశారు.

పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల తర్వాత బీజేపీ అధికార పీఠాన్ని దక్కించుకున్న తర్వాత జరుగుతున్న ఈ పరిణామం.. తృణమూల్ కాంగ్రెస్‌కు పెద్ద షాక్ అనే చెప్పాలి. రీతాబ్రతా బెనర్జీ క్లెయిమ్ చేస్తున్నట్లుగా నిజంగానే 50 మంది ఎమ్మెల్యేలు ఆయనకు మద్దతు ఇస్తే….రాష్ట్రంలో మమతా బెనర్జీ తదుపరి స్టెప్ ఏ విధంగా ఉండబోతుందో చూడాలి.

ప్రస్తుతం అసెంబ్లీ వేదికగా జరుగుతున్న ఈ పరిణామాలను బీజేపీ నిశితంగా గమనిస్తుండగా తిరుగుబాటు ఎమ్మెల్యేల తదుపరి అడుగు ఏంటనేది ఇప్పుడు బెంగాల్ రాజకీయాల్లో ఉత్కంఠ రేపుతోంది.

Also Read:ఇది రాచరికం కాదు..రబ్రీపై సీఎం!

- Advertisement -