అమెరికాలో 30 మంది భారతీయుల అరెస్ట్

1
- Advertisement -

అమెరికాలో అక్రమంగా నివసిస్తూ…నిబంధనలకు విరుద్ధంగా భారీ వాణిజ్య వాహనాలను నడుపుతున్న వారిపై యూఎస్ అధికారులు ఉక్కుపాదం మోపారు. ఆరిజోనా రాష్ట్రంలోని యూమా సెక్టార్ పరిధిలో యూఎస్ కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ (CBP) బలగాలు నిర్వహించిన ప్రత్యేక తనిఖీలలో భారీ స్థాయిలో అక్రమ వలసదారులు పట్టుబడ్డారు. ఈ ఆపరేషన్‌లో అరెస్టయిన వారిలో అత్యధికులు భారతీయులు కావడం గమనార్హం.

రహదారి భద్రతను పెంపొందించడం….అక్రమ వలసదారులను ఏరివేయడం లక్ష్యంగా అధికారులు ‘ఆపరేషన్ చెక్‌మేట్’పేరిట ఈ ప్రత్యేక నిఘా చేపట్టారు. ఈ తనిఖీల్లో దేశంలోకి అక్రమంగా ప్రవేశించి ఇక్కడే నివసిస్తున్న 52 మందిని అధికారులు అదుపులోకి తీసుకున్నారు.

మొత్తం 52 మందిని అరెస్ట్ చేయగా ఇందులో 30 మంది భారతీయులు ఉన్నారు. మిగిలిన ఆరుగురు మెక్సికో, ఎల్ సాల్వడార్, రష్యాలకు చెందినవారిగా అధికారులు గుర్తించారు. వీరిలో చాలా మంది వద్ద కాలిఫోర్నియా, న్యూయార్క్, వాషింగ్టన్, వర్జీనియా వంటి వివిధ రాష్ట్రాలు జారీ చేసిన కమర్షియల్ డ్రైవింగ్ లైసెన్సులు ఉన్నాయి.అయితే, విచారణలో వీరి వద్ద ఉన్న ఉపాధి అనుమతి పత్రాలు కాలంచెల్లినవని వారు అమెరికాలో చట్టవిరుద్ధంగా ఉంటున్నారని తేలింది. కొందరి వద్ద అసలు ఎలాంటి చెల్లే లైసెన్సులు కూడా లేవని యూఎస్ అధికారులు వెల్లడించారు.

Also Read:తెలంగాణను కాపాడుకుందాం!

అమెరికా రహదారులపై ఇటీవల కాలంలో అక్రమ వలసదారులు నడుపుతున్న భారీ ట్రక్కుల కారణంగా ప్రాణాంతక ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో ట్రంప్ ప్రభుత్వం ఈ తరహా తనిఖీలను తీవ్రతరం చేసింది.

- Advertisement -