ముషీరాబాద్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే ముఠా గోపాల్ ఆధ్వర్యంలో జరిగిన బీఆర్ఎస్ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. రాష్ట్రంలో త్వరలోనే ప్రారంభం కానున్న SIR ప్రక్రియపై సమగ్రంగా చర్చించి, క్షేత్రస్థాయిలో పార్టీ క్యాడర్ అనుసరించాల్సిన వ్యూహాలపై దిశానిర్దేశం చేశారు కేటీఆర్.
ఈ మూర్ఖులు జీ.వో 17 రద్దు చేయకపోతే.. 2028లో మన ప్రభుత్వం వచ్చిన తర్వాత 50 వేల మందిని కాంట్రాక్టర్లుగా చేసే బాధ్యత నాది అన్నారు కేటీఆర్. మాయల ఫకీర్ ప్రాణం చిలకలో ఉన్నట్లు రేవంత్ రెడ్డి ప్రాణం ఢిల్లీలో ఉంటది అన్నారు. అవసరమైతే ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద ధర్నా చేద్దాం అన్నారు.
కచ్చితంగా జీ.వో 17 రద్దు అయేదాక, రేవంత్ రెడ్డికి బుద్ధి వచ్చేదాక, ఎస్సీ, ఎస్టీలకు 30 శాతం, బీసీలకు 42 శాతం ఇచ్చేవరకు రాహుల్ గాంధీని ఇడిచి పెట్టేది లేదు..ఇంకో సంవత్సరం కష్టపడితే మనల్ని సతాయించే కాంగ్రెస్, బీజేపీ వాళ్ళకి మిత్తితో సహా చెల్లించే బాధ్యత నాది అన్నారు. ఈ సమావేశంలో పాల్గొన్న మాజీ మంత్రి, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్, బీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్, ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి, ఎమ్మెల్సీలు వాణి దేవి, దేశపతి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
Also Read:తెలంగాణ జనసేన నేతలతో పవన్

