బాడీ షేమింగ్‌పై హుమా ఖురేషి

4
- Advertisement -

బాలీవుడ్ ప్రముఖ నటి హుమా ఖురేషి తన కెరీర్ ప్రారంభంలో ఎదుర్కొన్న బాడీ షేమింగ్ నెగిటివ్ కామెంట్స్ గురించి మనసు విప్పి మాట్లాడారు. తన లుక్స్, బరువు గురించి చేసిన విమర్శలు తన ఆత్మవిశ్వాసాన్ని ఎంతగా దెబ్బతీశాయో..మానసికంగా తానెంత కుంగిపోయానో ఆమె పంచుకున్నారు.

ఓ ఇంటర్వ్యూలో హుమా మాట్లాడుతూ.. పరిశ్రమలోకి వచ్చిన కొత్తలో నా శరీరాకృతిపై చాలా మంది ప్రతికూల వ్యాఖ్యలు చేశారు. ఆ కామెంట్స్ నా మనసును తీవ్రంగా గాయపరిచాయి అన్నారు. నాపై నాకు నమ్మకం కోల్పోయేలా చేశాయి… ఒక దశలో ఆ విమర్శల భయంతో నలుగురిలోకి వెళ్లడానికి కూడా జంకేదాన్ని… నన్ను నేను ఒక గదికే పరిమితం చేసుకుని సమాజానికి దూరంగా జరిగిపోయాను అని ఆవేదన వ్యక్తం చేశారు.

తెరపై కనిపించే నటీమణులు ఒక పర్ఫెక్ట్ సైజులో నిర్దిష్టమైన కొలతలతోనే ఉండాలనే సమాజపు అంచనాలు తనను చాలా ఒత్తిడికి గురిచేశాయని ఆమె చెప్పారు. ఆ సమయంలో తన బరువును తగ్గించుకోవడానికి తీవ్రంగా ప్రయత్నించానని కానీ అది తనను మరింత కలవరపాటుకు గురిచేసిందే తప్ప ప్రశాంతతను ఇవ్వలేదని హుమా పేర్కొన్నారు.

అయితే కాలక్రమేణా ఆ ఒత్తిడి నుండి తాను ఎలా బయటపడ్డాననే విషయాన్ని కూడా ఆమె వివరించారు. నా శరీరాన్ని నేను ఎలాగైతే ఉన్నానో అలాగే ప్రేమించడం నేర్చుకున్నాను…. ప్రతి ఒక్కరి శరీరం ఒకేలా ఉండదు…. సన్నగా ఉండటమే అందం అనే భ్రమ నుండి బయటకు రావడానికి నాకు కొంత సమయం పట్టింది అన్నారు. ఇప్పుడు నేను నా నటనపై…నా ఆరోగ్యంపై మాత్రమే దృష్టి పెడుతున్నాను… ఎవరు ఎలాంటి కామెంట్స్ చేసినా నేను పట్టించుకోవడం లేదు అని హుమా ఖురేషి చెప్పుకొచ్చారు.

Also Read:పద్మనాభస్వామి ఆలయంలో వజ్రాలు మాయం!

- Advertisement -