ఇరాన్‌తో ఒప్పందంపై ట్రంప్

4
- Advertisement -

తన పరిపాలనలో ఇరాన్‌తో కుదిరే ఎలాంటి భవిష్యత్తు ఒప్పందంలోనైనా ఎటువంటి ఆర్థిక రాయితీలు (నగదు ఇవ్వడం) ఉండవని, ఇది అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా హయాంలో జరిగిన ఒప్పందానికి పూర్తిగా భిన్నంగా ఉంటుందని డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. సోషల్ మీడియాలో చేసిన ఒక పోస్ట్‌లో ట్రంప్, ఒబామా కాలం నాటి ఇరాన్ అణు ఒప్పందాన్ని విమర్శించారు. తాము ప్రతిపాదిస్తున్న నూతన ఒప్పందం టెహ్రాన్ అణు ఆయుధాలను పొందకుండా అడ్డుకుంటుందని ఆయన నొక్కి చెప్పారు. మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా రూపొందించిన ఒప్పందానికి ఇది భిన్నంగా ఉంటుందని ట్రంప్ స్పష్టం చేశారు.

నేను ఇరాన్‌తో ఒప్పందం చేసుకుంటే అది సరైనదిగా మరియు మంచిదిగా ఉంటుంది…. ఒబామా చేసిన ఒప్పందంలా ఉండదు,ఆ ఒప్పందం ఇరాన్‌కు భారీ మొత్తంలో నగదును (CASH) అందించడమే కాకుండా, అణు ఆయుధాన్ని తయారు చేయడానికి స్పష్టమైన, బహిరంగ మార్గాన్ని ఇచ్చింది అన్నారు ట్రంప్. మా ఒప్పందం దానికి పూర్తి వ్యతిరేకం, అయితే దీనిని ఇంకా ఎవరూ చూడలేదు లేదా ఇది ఏంటో ఎవరికీ తెలియదు. ఇది ఇంకా పూర్తిగా ముగియలేదు (సర్చలు జరుగుతున్నాయి). కాబట్టి, తాము ఏమీ తెలియని విషయంపై విమర్శలు చేసే ఓటముల మాటలు వినకండి. చాలా ఏళ్ల క్రితమే ఈ సమస్యను పరిష్కరించాల్సింది పోయి విఫలమైన నా పూర్వీకులలా కాకుండా, నేను చెడ్డ ఒప్పందాలు చేసుకోను అని ట్రంప్ పేర్కొన్నారు.

మరోవైపు ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు మాట్లాడుతూ.. హార్ముజ్ జలసంధిని తిరిగి తెరవడానికి కుదిరిన అవగాహన ఒప్పందం (MoU) మరియు ఇరాన్ అణు కార్యక్రమంపై తుది ఒప్పందం కోసం జరగబోయే చర్చల గురించి తాను ట్రంప్‌తో మాట్లాడినట్లు తెలిపారు.

Also Read:శక్తిమాన్‌గా అల్లు అర్జున్?

- Advertisement -