కేరళం కాంగ్రెస్‌లో విభేదాలు?

7
- Advertisement -

కేరళం తదుపరి ముఖ్యమంత్రి ఎంపిక విషయంలో కాంగ్రెస్ పార్టీలో అంతర్గత పోరు మొదలైనట్లు సంకేతాలు కనిపిస్తున్నాయి. ఒకవేళ ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ను ముఖ్యమంత్రిగా ఎంపిక చేస్తే, సీనియర్ నేత వి.డి. సతీశన్ మంత్రివర్గంలో చేరే అవకాశం లేదని పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి.

ప్రస్తుతం కేరళం సీఎం పీఠం కోసం ముగ్గురు ప్రధాన నేతల మధ్య గట్టి పోటీ నెలకొంది. కేసీ వేణుగోపాల్: ఏఐసీసీ జనరల్ సెక్రటరీ (ఆర్గనైజేషన్),వి.డి. సతీశన్ ప్రస్తుత ప్రతిపక్ష నేత, రమేష్ చెన్నితల సీనియర్ కాంగ్రెస్ నేత.

140 స్థానాలున్న కేరళ అసెంబ్లీలో కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ (UDF) 102 సీట్లు గెలుచుకుని ఘనవిజయం సాధించింది. మే 4న ఫలితాలు వచ్చినప్పటికీ, ముఖ్యమంత్రి ఎవరనే దానిపై ఇప్పటికీ ఉత్కంఠ కొనసాగుతోంది. పార్టీ పరిశీలకులు అజయ్ మాకెన్, ముకుల్ వాస్నిక్ ఎమ్మెల్యేల అభిప్రాయాలను సేకరించినప్పటికీ, తుది నిర్ణయం వెలువడలేదు.

Also Read:సనాతన ధర్మ పరిరక్షకుడు పవన్!

ఒకవేళ కేసీ వేణుగోపాల్‌ను సీఎంగా చేస్తే, ఆయన అసెంబ్లీకి ఎన్నికవ్వడానికి ఒకటి, ఆయన ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్న ఆలప్పుజ లోక్‌సభ స్థానానికి మరొకటి.. ఇలా రెండు ఉప ఎన్నికలు ఎదుర్కోవాల్సి వస్తుందని సతీశన్ వర్గం వాదిస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఇది రాజకీయంగా రిస్క్ అని వారు భావిస్తున్నారు. మెజారిటీ ఎమ్మెల్యేలు, ఎంపీల మద్దతు వేణుగోపాల్‌కే ఉందని ఆయన అనుచరులు చెబుతున్నారు. ఆయన ఒక గొప్ప వ్యూహకర్త అని, ఎలాంటి ఉప ఎన్నికలనైనా గెలిపించగల సామర్థ్యం ఆయనకు ఉందని వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -