హైదరాబాద్ వేదికగా ఇంధన పొదుపుపై తాను చేసిన విజ్ఞప్తికి కట్టుబడి, ప్రధాని నరేంద్ర మోదీ తన స్వదేశీ పర్యటనల్లో కాన్వాయ్ (వాహన శ్రేణి) పరిమాణాన్ని గణనీయంగా తగ్గించుకున్నారు. భద్రతా ఏర్పాట్లలో ఎలాంటి రాజీ పడకుండానే, అనవసర వ్యయాన్ని తగ్గించవచ్చని ఆయన నిరూపిస్తున్నారు.
ఇటీవల వడోదర, గువహటి నగరాల్లో పర్యటించిన సమయంలో, గత పర్యటనలతో పోలిస్తే ప్రధాని కాన్వాయ్‌లో వాహనాల సంఖ్య తక్కువగా ఉంది.స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ నిర్దేశించిన భద్రతా ప్రోటోకాల్స్‌ను పాటిస్తూనే, అదనంగా ఉండే వాహనాలను తొలగించారు. అత్యవసర భద్రతా వాహనాలు మినహా మిగిలిన వాటిని తగ్గించారు.
హైదరాబాద్‌లో ఆయన ప్రసంగించిన వెంటనే ఈ నిర్ణయం అమలులోకి రావడం గమనార్హం. కేవలం ఇంధన పొదుపే కాకుండా, అడ్మినిస్ట్రేటివ్ సామర్థ్యం మరియు ప్రజల సౌకర్యాన్ని కూడా దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నారు. సాధారణంగా వీవీఐపీల కదలికల వల్ల భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడి సామాన్యులు ఇబ్బంది పడుతుంటారు. కాన్వాయ్ తగ్గడం వల్ల ట్రాఫిక్ సమస్యలు కూడా తగ్గే అవకాశం ఉంది.
ప్రధాని తీసుకున్న ఈ నిర్ణయంపై రాజకీయ, పరిపాలనా వర్గాల్లో చర్చ మొదలైంది. దీని ప్రభావంతో ఇప్పటికే ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు, మంత్రుల కాన్వాయ్‌లను కూడా తగ్గించాలని ఆదేశాలు జారీ అయ్యాయి. ప్రభుత్వ వనరులను సద్వినియోగం చేసుకోవడం మరియు అనవసర ఖర్చులను తగ్గించడంపై ఇది ప్రజల్లోకి సానుకూల సందేశాన్ని తీసుకువెళ్తుంది.
Also Read:సనాతన ధర్మ పరిరక్షకుడు పవన్!
హైదరాబాద్ ప్రసంగంలో ప్రధాని మోదీ విదేశీ మారక ద్రవ్యాన్ని ఆదా చేయడంలో ప్రజల సహకారాన్ని కోరారు.
వచ్చే ఒక ఏడాది పాటు బంగారం కొనవద్దని కోరారు.
కోవిడ్ కాలంలో అలవాటైన వర్క్ ఫ్రమ్ హోమ్, ఆన్‌లైన్ సమావేశాలు, వీడియో కాన్ఫరెన్స్‌లను కొనసాగించాలని సూచించారు. ప్రపంచవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతున్న నేపథ్యంలో ఇంధనాన్ని ఆదా చేయడం దేశానికి అత్యవసరమని ఆయన గుర్తు చేశారు.

