ఐపీఎల్ 2026 సీజన్ ముగింపు దశకు చేరుకుంటున్న తరుణంలో, ప్లేఆఫ్స్ బెర్తుల కోసం పోటీ అత్యంత ఆసక్తికరంగా మారింది. గణాంకాల ప్రకారం ఏ జట్టుకు ఎన్ని అవకాశాలు ఉన్నాయో తాజా నివేదిక వెల్లడించింది.
టాప్ 3లో ఉన్న గుజరాత్ టైటాన్స్, ఆర్సీబీ, హైదరాబాద్ జట్లకు 80 శాతం అవకాశాలుండగా రుతురాజ్ గైక్వాడ్ సారథ్యంలోని సీఎస్‌కే జట్టుకు ప్లేఆఫ్స్ చేరడానికి 42.7% అవకాశం ఉంది. మిగిలిన మ్యాచ్‌లలో ప్రదర్శన ఈ అవకాశాన్ని పెంచవచ్చు .
యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాజస్థాన్ రాయల్స్ జట్టుకు 41.8% అవకాశం ఉందని గణాంకాలు చెబుతున్నాయి.ప్లేఆఫ్స్ చేరాలంటే జట్లు కనీసం 16 పాయింట్లను సాధించాల్సి ఉంటుంది.నెట్ రన్ రేట్ (NRR) కూడా చివరి దశలో కీలక పాత్ర పోషించనుంది, ముఖ్యంగా సమాన పాయింట్లు ఉన్న జట్ల మధ్య పోటీ నెలకొన్నప్పుడు.
ఈ సీజన్‌లో వైభవ్ సూర్యవంశీ తన అద్భుతమైన బ్యాటింగ్‌తో అందరి దృష్టిని ఆకర్షించాడు. రాజస్థాన్ రాయల్స్ ప్లేఆఫ్స్ ఆశలు అతని ఫామ్ పై కూడా ఆధారపడి ఉన్నాయి.ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ప్రతి మ్యాచ్ ఫలితం మిగిలిన జట్ల అవకాశాలను ప్రభావితం చేస్తోంది. మున్ముందు జరగబోయే పోరాటాలు ప్లేఆఫ్స్ రేసును మరింత రసవత్తరంగా మార్చనున్నాయి.


