బండి సంజయ్ కుమారుడు భగీరత్ పై కేసు నమోదు చేసిన పోలీసులు, ఇంకా ఎందుకు అరెస్ట్ చేయకుండా కాలయాపన చేస్తున్నారని ఎమ్మెల్యే కేపీ వివేకానంద ప్రశ్నించారు.
జగద్గిరిగుట్టలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ…కేంద్ర హోమ్ శాఖ సహాయ మంత్రిగా ఉన్న బండి సంజయ్, రాష్ట్ర హోమ్ శాఖను దగ్గర పెట్టుకున్న రేవంత్ రెడ్డి కుమ్మక్కై కేసును నీరు కార్చే ప్రయత్నం చేస్తున్నారని మండి పడ్డారు.
మైనర్ బాలికకు న్యాయం చేయకుండా, బండి సంజయ్ కుమారుడిని కాపాడే ప్రయత్నం చేస్తున్నారని, రాష్ట్రంలో పేదలకు ఒక న్యాయం పెద్దలకు ఒక న్యాయమా అని ప్రశ్నించారు.జరిగిన ఘటనపై కేంద్ర మంత్రి బండి సంజయ్ పదవికి రాజీనామా చేయాలని, రేవంత్ ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకుని బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని, లేని యెడల బాధితుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ కొట్లాడుతుందని స్పష్టం చేశారు.
Also Read:BRS:రేపు కేసీఆర్ అధ్యక్షతన సమావేశం

