క్రూయిజ్ షిప్‌లో అరుదైన హంటావైరస్ వ్యాప్తి చెందడంతో ముగ్గురు ప్రయాణికులు మరణించడం అంతర్జాతీయంగా ఆందోళన కలిగిస్తోంది. ఎలుకల ద్వారా వ్యాపించే ఈ వైరస్ పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
హంటా వైరస్..ప్రధానంగా ఎలుకల ద్వారా మనుషులకు సోకుతుంది. ఎలుకల మూత్రం, విసర్జితాలు లేదా లాలాజలంతో సంబంధం ఉన్నప్పుడు లేదా అవి కలిసిన గాలిని పీల్చినప్పుడు ఈ వైరస్ శరీరంలోకి ప్రవేశిస్తుంది. ఇది ఒకరి నుండి ఒకరికి నేరుగా వ్యాపించదు, కానీ సోకిన వారికి ప్రాణాపాయం కలిగించే అవకాశం ఎక్కువ.
ప్రధాన లక్షణాలు:
ఈ వైరస్ సోకిన మొదటి దశలో సాధారణ జ్వరం లాంటి లక్షణాలు కనిపిస్తాయి:
తీవ్రమైన జ్వరం మరియు చలి: అకస్మాత్తుగా వచ్చే జ్వరం.
కండరాల నొప్పులు: ముఖ్యంగా వెన్ను, తొడలు మరియు భుజాలలో విపరీతమైన నొప్పి.
అలసట మరియు తల తిరగడం: శరీరం పూర్తిగా నీరసించిపోవడం.
జీర్ణ సమస్యలు: కడుపు నొప్పి, వాంతులు మరియు విరేచనాలు.
రెండవ దశ (తీవ్రమైనప్పుడు):
వైరస్ సోకిన 4 నుండి 10 రోజుల తర్వాత, ఊపిరితిత్తులలో ద్రవం చేరి శ్వాస తీసుకోవడం కష్టమవుతుంది.ఇది ప్రాణాంతకంగా మారుతుంది.
చికిత్స మరియు నివారణ:
నిర్దిష్ట చికిత్స లేదు: హంటావైరస్‌కు వ్యతిరేకంగా పని చేసే ప్రత్యేకమైన వ్యాక్సిన్ లేదా మందులు ఇంకా అందుబాటులో లేవు.లక్షణాలు కనిపించిన వెంటనే ఐసీయూ (ICU) లో చేరి ఆక్సిజన్ సపోర్ట్ తీసుకోవడం వల్ల ప్రాణాలను కాపాడుకోవచ్చు.
Also Read:షారుఖ్-దీపికా ‘కింగ్’..షూటింగ్ లీక్!
నివసించే ప్రాంతాల్లో లేదా ప్రయాణించే ప్రదేశాల్లో ఎలుకలు లేకుండా చూసుకోవడం అత్యంత ముఖ్యం. ఎలుకలు తిరిగే అవకాశం ఉన్న ప్రాంతాలను క్లీన్ చేసేటప్పుడు మాస్క్ మరియు గ్లౌజులు తప్పనిసరిగా వాడాలి.

