ఉత్తరప్రదేశ్ అసెంబ్లీలో జరిగిన చర్చలో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రతిపక్షాలపై విమర్శనాస్త్రాలు సంధించారు. ప్రతిపక్ష పార్టీలు ఎల్లప్పుడూ మహిళల ప్రయోజనాలకు మరియు వారి సంక్షేమానికి అడ్డుపడుతున్నాయని ఆయన ఆరోపించారు. మహిళా సాధికారత మరియు రక్షణ కోసం తమ ప్రభుత్వం తీసుకువచ్చిన పథకాలను ప్రతిపక్షాలు కావాలనే వ్యతిరేకిస్తున్నాయని యోగి పేర్కొన్నారు. మహిళల భద్రత విషయంలో గత ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరించాయని ఆయన విమర్శించారు.
రాష్ట్రంలో మహిళల భద్రత కోసం ప్రవేశపెట్టిన ‘మిషన్ శక్తి’ వంటి కార్యక్రమాలు మంచి ఫలితాలను ఇస్తున్నాయని, నేరగాళ్లలో భయం పుట్టిస్తున్నాయని ఆయన చెప్పారు.తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి మహిళల విద్య, ఆరోగ్యం మరియు ఉపాధికి పెద్దపీట వేస్తోందని, దీనిని అడ్డుకోవాలని చూడటం ప్రతిపక్షాల సంకుచిత మనస్తత్వానికి నిదర్శనమని మండిపడ్డారు.
ముఖ్యమంత్రి ప్రసంగం సమయంలో అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. మహిళల హక్కుల విషయంలో తమ చిత్తశుద్ధిని శంకించవద్దని ప్రతిపక్ష నేతలు నిరసన వ్యక్తం చేశారు.మహిళల గౌరవాన్ని కాపాడటం మా ప్రభుత్వ ప్రథమ కర్తవ్యం. అభివృద్ధిలో వారిని భాగస్వాములను చేసే క్రమంలో ఎన్ని అడ్డంకులు ఎదురైనా వెనక్కి తగ్గం అన్నారు యోగి ఆదిత్యనాథ్.
ఉత్తరప్రదేశ్‌లో రాబోయే రాజకీయ పరిణామాల నేపథ్యంలో, మహిళా ఓటర్లను ఆకట్టుకునేలా మరియు ప్రతిపక్షాలను డిఫెన్స్‌లో పడేసేలా ముఖ్యమంత్రి చేసిన ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
Also Read:విద్వేషపూరిత ప్రసంగాలపై సుప్రీం!

