రూమర్లు వద్దు…’మా’ విజ్ఞప్తి

215
Sivaji Raja,Naresh About Drugs Case In Tollywood
- Advertisement -

డ్రగ్స్‌ కలకలంపై మీడియాలో వస్తున్న రూమర్లలో పలువురు సినీ ప్రముఖులు స్పందించారు.  నటులు సినిమాల్లో కనిపించే పాత్రలతో నిజ జీవితంలో వారిని పోల్చడం సరికాదని మా అధ్యక్షుడు శివాజీ రాజా కోరారు. ఎంతో మంది న‌టులు సినిమాల్లో బాగా మందు తాగుతున్న‌ట్లు, వారి ప్ర‌వ‌ర్త‌న బాగోలేన‌ట్లు న‌టిస్తార‌ని  అలాగ‌ని నిజ‌జీవితంలోనూ వారు అలాగే ఉంటార‌ని అనుకోవ‌ద్ద‌న్నారు. యువ‌న‌టుడు త‌నీష్ కూడా డ్ర‌గ్స్‌ కేసులో ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయ‌ని, ఆ న‌టుడికి ఈ కేసులో ఎటువంటి సంబంధం లేద‌ని తాను అనుకుంటున్నాన‌ని అన్నాడు. నోటీసులు అందుకున్న‌ వారి పేర్లను మాత్ర‌మే టీవీల్లో వేయాల‌ని ఆయ‌న కోరారు.

కొందరు చేసిన పనికి సినీ పరిశ్రమ మొత్తాన్ని నిందంచవద్దని సినీయర్ నటుడు నరేష్ విజ్ఞప్తి చేశారు.  డ్ర‌గ్స్ ఎవ‌రు తీసుకున్నా తాము ఆ చ‌ర్య‌ను ఖండిస్తామ‌ని అన్నారు. తాము చ‌ట్టాన్ని గౌర‌విస్తామ‌ని, అయితే, మీడియాలో రూమ‌ర్లను మాత్రం ప్ర‌సారం చేయ‌కూడ‌ద‌ని కోరారు.

డ్రగ్స్‌ వ్యవహారంతో తమకు ఎటువంటి సంబంధం లేదని హీరో నందు తెలిపారు. తన జీవితంలో ఎప్పుడూ డ్రగ్స్‌ చూడలేదన్నారు. అలాంటిది మీడియాలో నా పేరు కూడా రావడం ఆశ్ఛర్యానికి గురిచేసింది. అధికారుల నుంచి తనకు ఎటువంటి నోటీసులు అందలేదని చెప్పారు. తనకు డ్రగ్స్‌ తీసుకునే అలవాటు లేదని, ఈ కేసుతో నాకు సంబంధం లేదన్నారు. ఏ పరీక్షకైనా తాను సిద్ధమని, డ్రగ్‌ కేసులో తనను ఇరికించే ఉద్దేశంతోనే ఇదంతా చేసివుంటారన్న అనుమానాన్ని వ్యక్తం చేశారు. మీడియా దయచేసి వాస్తవాలు తెలుసుకుని వెలుగులోకి తేవాలని కోరారు.

ఆర్టిస్ట్ లు, టెక్నీషియన్స్ డ్రగ్స్ కు బానిసలవడం తనకు నచ్చలేదని, చాలా బాధాకరమైన విషయమని ప్రముఖ సీనియర్ నటుడు భానుచందర్ అన్నారు. సినీ పరిశ్రమకు చెందిన పలువురు డ్రగ్స్ కు బానిసలైన విషయమై మీడియా ప్రశ్నించగా భానుచందర్ మాట్లాడుతూ, గతంలో డ్రగ్స్ కు బానిసను అయిన తాను, చాలా దెబ్బతిన్నానని చెప్పారు. అప్పటికి తనకు ఇంకా పెళ్లి కాలేదని, డ్రగ్స్ మత్తులో పడిపోయానని, అయితే.. దాని నుంచి బయటపడేందుకు మార్షల్ ఆర్ట్స్, తన అన్నయ్య ఇచ్చిన స్ఫూర్తి తనకు ఎంతగానో దోహదపడ్డాయని చెప్పారు.

మరోవైపు ఈ కేసును దర్యాప్తు చేపడుతున్న ఎక్సైజ్ శాఖ‌ డైరెక్టర్ అకున్ సబర్వాల్ ప‌దకొండు రోజులు వ్య‌క్తిగ‌త సెల‌వులు తీసుకున్న‌ట్లు చెప్పారు. ఈ నెల 16 నుంచి ఈ నెల 27వ‌ర‌కు తాను సెల‌వుల‌పై వెళ్తున్న‌ట్లు చెప్పారు. త‌న వ్య‌క్తిగ‌త ప‌నుల‌పైనే ఈ సెల‌వులు తీసుకున్నాన‌ని చెప్పారు. తన సెలవులకు విచారణకు ఏమాత్రం సంబంధం లేదన్నారు.

- Advertisement -