ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రభావవంతమైన వ్యక్తుల పేర్లతో ‘టైమ్’ (TIME) పత్రిక విడుదల చేసిన ప్రతిష్టాత్మక ‘టైమ్ 100’ జాబితాలో ఒక తెలుగు వ్యక్తి చోటు సంపాదించుకోవడం గర్వకారణంగా మారింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి అమెరికాకు వలస వెళ్లి, అక్కడ కార్డియాలజిస్ట్‌గా విశేష సేవలు అందిస్తున్న డాక్టర్ కిరణ్ ముసునూరు ఈ అరుదైన గౌరవాన్ని దక్కించుకున్నారు.
వైద్య రంగంలో, ముఖ్యంగా గుండె సంబంధిత వ్యాధుల పరిశోధనలో డాక్టర్ కిరణ్ ముసునూరు చేసిన కృషికి గానూ ఈ గుర్తింపు లభించింది. ప్రపంచ గమనాన్ని మార్చగల శక్తి ఉన్న 100 మంది వ్యక్తుల జాబితాలో ఏపీ మూలాలున్న వ్యక్తి నిలవడం తెలుగువారందరికీ గర్వకారణం.
ఈ ప్రతిష్టాత్మక జాబితాలో కిరణ్ ముసునూరుతో పాటు ప్రపంచ రాజకీయ, వ్యాపార, కళా రంగాలకు చెందిన దిగ్గజాలు ఉన్నారు.అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, చైనా అధ్యక్షుడు షి జిన్ పింగ్, కెనడా ప్రధాని మార్క్ కార్నీ, అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో, న్యూయార్క్ మేయర్ జొహ్రాన్ మష్రనీ.
Also Read:దక్షిణాదికి అన్యాయం జరగకూడదు:గుత్తా
ఆధ్యాత్మికం: పోప్ లియో.
టెక్ & బిజినెస్: గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్, యూట్యూబ్ అధినేత నీల్ మోహన్.
కళలు & ఇతర రంగాల ప్రముఖులు: బాలీవుడ్ నటుడు రణ్‌బీర్ కపూర్, ప్రముఖ మిషెలిన్ స్టార్ షెఫ్ వికాస్ ఖన్నా.
ప్రపంచ ప్రఖ్యాత నేతలు మరియు సెలబ్రిటీలతో కూడిన ఈ జాబితాలో డాక్టర్ కిరణ్ ముసునూరు పేరు ఉండటం ఆయన ప్రతిభకు మరియు సమాజానికి ఆయన అందిస్తున్న సేవలకు నిదర్శనం.

