లోక్‌సభకు 850 సీట్లతో డీలిమిటేషన్

5
- Advertisement -

భారత ప్రజాస్వామ్య వ్యవస్థలో అత్యంత కీలకమైన అడుగు పడబోతోంది. దేశ జనాభా పెరుగుదల, పరిపాలనా సౌలభ్యం మరియు నియోజకవర్గాల పునర్విభజనను దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం ‘రాజ్యాంగ (131వ సవరణ) బిల్లు, 2026’ ను ప్రతిపాదించింది. ఈ బిల్లు ఆమోదం పొందితే, లోక్ సభ స్వరూపం పూర్తిగా మారిపోనుంది.

ప్రస్తుతం లోక్ సభలో 543 మంది సభ్యులు ఉండగా, కొత్త ప్రతిపాదన ప్రకారం ఈ సంఖ్య 850కి చేరనుంది. వివిధ రాష్ట్రాలలోని ప్రాదేశిక నియోజకవర్గాల నుండి ప్రత్యక్ష ఎన్నికల ద్వారా ఎన్నుకోబడే సభ్యుల సంఖ్య 815కి పరిమితం కానుంది.

కేంద్రపాలిత ప్రాంతాల నుండి ప్రాతినిధ్యం వహించే సభ్యుల సంఖ్యను 35 వరకు పెంచాలని బిల్లు ప్రతిపాదించింది. 1971 జనాభా లెక్కల ఆధారంగా ఇప్పటివరకు నియోజకవర్గాల సంఖ్య కొనసాగుతోంది. అయితే, గత ఐదు దశాబ్దాలలో జనాభా విపరీతంగా పెరగడంతో, ఒక్కో ఎంపీ ప్రాతినిధ్యం వహించే ఓటర్ల సంఖ్య కూడా భారీగా పెరిగింది. ఈ వ్యత్యాసాన్ని తగ్గించి, ప్రజలకు తమ ప్రతినిధులు మరింత అందుబాటులో ఉండేలా చేయడమే ఈ 131వ సవరణ బిల్లు ప్రధాన ఉద్దేశ్యం.

రాష్ట్రాలకు 815, యూటీలకు 35 లోక్‌సభ స్థానాలు ఉండనున్నాయి. ఇందుకు సంబంధించిన రాజ్యాంగ సవరణ బిల్లు డ్రాప్ట్ ఎంపీలకు అందజేశారు. అలాగే 16, 17, 18 తేదీల్లో మహిళా చట్ట సవరణ బిల్లు ప్రవేశపెట్టనుండగా ఆర్టికల్ 55, 81 సవరణలకు సర్క్యులర్ జారీ చేసింది కేంద్రం.

ఈ బిల్లు చట్టంగా మారితే, భారత పార్లమెంటరీ చరిత్రలో ఇది అతిపెద్ద సంస్కరణగా నిలిచిపోతుంది. కొత్తగా నిర్మించిన పార్లమెంట్ భవనం కూడా ఈ అదనపు సభ్యుల సీటింగ్ సామర్థ్యాన్ని దృష్టిలో ఉంచుకునే నిర్మించబడింది.

Also Read:IPL:ఎవరీ సాకిబ్ హుస్సేన్?

- Advertisement -