IPL:ప్రఫుల్ హింగే..ఆల్‌టైం రికార్డు!

4
- Advertisement -

ఐపీఎల్ కెరీర్‌ను కలలో కూడా ఊహించని రీతిలో ప్రాఫుల్ హింగే ప్రారంభించాడు. ఏప్రిల్ 13, సోమవారం నాడు ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్ (RR)తో జరిగిన మ్యాచ్‌లో, ఈ ఎస్‌ఆర్‌హెచ్ పేసర్ తన అద్భుత బౌలింగ్‌తో చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్ చరిత్రలో ఇన్నింగ్స్ మొదటి ఓవర్‌లోనే మూడు వికెట్లు తీసిన తొలి ఆటగాడిగా ప్రాఫుల్ హింగే రికార్డు నెలకొల్పాడు.

వైభవ్ సూర్యవంశీ: ఇన్నింగ్స్ రెండో బంతికే అద్భుతమైన హార్డ్-లెంగ్త్ డెలివరీతో ‘వండర్ కిడ్’ సూర్యవంశీని ‘గోల్డెన్ డక్’ (తొలి బంతికే అవుట్)గా వెనక్కి పంపాడు.

ధ్రువ్ జురెల్: రెండు బంతుల తర్వాత, ఆఫ్ స్టంప్ బయట పడిన బంతిని ఆడబోయి జురెల్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు.
లువాన్ డ్రే ప్రిటోరియస్: అదే ఓవర్ చివరిలో దక్షిణాఫ్రికా కుర్రాడు ప్రిటోరియస్ ఫ్లిక్ చేయబోయి డీప్ బ్యాక్ వర్డ్ స్క్వేర్ లెగ్ లో క్యాచ్ ఇచ్చి డకౌట్ అయ్యాడు.

అంతటితో ఆగకుండా, తన తర్వాతి ఓవర్‌లో రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ రియాన్ పరాగ్ వికెట్‌ను కూడా హింగే పడగొట్టాడు. దీంతో రాజస్థాన్ రాయల్స్ జట్టు కేవలం 9 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది.

Also Read:‘డెకాయిట్‌’..మంచి సినిమా తీశాం!

విదర్భకు చెందిన కుడిచేతి వాటం ఫాస్ట్ బౌలర్ హింగేను ఐపీఎల్ 2026 వేలంలో ఎస్‌ఆర్‌హెచ్ ఇతడిని ₹30 లక్షల బేస్ ప్రైస్‌కు కొనుగోలు చేసింది.

డొమెస్టిక్ రికార్డు: * 10 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌ల్లో 27 వికెట్లు పడగొట్టాడు.

6 లిస్ట్ ఏ (List A) మ్యాచ్‌ల్లో 5 వికెట్లు తీశాడు.

ఐపీఎల్ కంటే ముందు కేవలం ఒకే ఒక్క టీ20 (సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ఆంధ్రాపై) ఆడాడు.

- Advertisement -