సీఎం రేవంత్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు మాజీ మంత్రి జీవన్ రెడ్డి. కాంగ్రెస్ అధిష్టానం తెలంగాణపై పట్టు కోల్పోయింది అని..ఒకప్పుడు పీసీసీ చెప్పినట్టు సీఎం నడుచుకునే వారు… కానీ ఇప్పుడు సీఎం చెబితే పీసీసీ అమలు చేస్తోంది అని విమర్శించారు.
త్వరలోనే జగిత్యాలలో భారీ బహిరంగ సభ పెట్టి కేసీఆర్ సమక్షంలో జాయిన్ అవుతానని… పీసీసీ తప్పు చేసి ఆ నింద AICC పై వేస్తుంది అని ఆరోపించారు. నాకు 14 సార్లు B ఫామ్ ఇచ్చారంటే అది నా సమర్థతోనే ఇచ్చారు… నేను కంటెంట్ ఉన్న నాయకున్నీ కాబట్టే కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది అన్నారు.
అధికార పార్టీ నుంచి ప్రతిపక్షంలోకి ఎందుకు వెళ్తున్నానో మీకే తెలియాలి..కాంగ్రెస్ ప్రభుత్వం తిరోగమనంలో పయనిస్తుంది అన్నారు. కాంగ్రెస్ పోవాలి కేసీఆర్ రావాలి అని ప్రజల్లో చర్చ మొదలైంది…మిగిలిన రెండున్నరేళ్లు అయిన కాంగ్రెస్ ప్రభుత్వం బాగా పని చేయాలని కోరుకుంటున్నా అన్నారు.
Also Read:ప్రజాక్షేత్రంలోకి కేసీఆర్

