కోహ్లీతో పోలీక..బాబర్ అసహనం!

7
- Advertisement -

టీమిండియా స్టార్ విరాట్ కోహ్లీతో తనను పోల్చడంపై ఆగ్రహం వ్యక్తం చేశాడు పాక్ క్రికెటర్ బాబర్ అజామ్. ఓ రిపోర్టర్, కోహ్లీలా మ్యాచ్‌లను ఫినిష్ చేయలేకపోతున్నారని బాబర్‌ను ప్రశ్నించాడు. దీనిపై స్పందించిన బాబర్.. “ఇలాంటి పోలికలు ఆపండి. మీ దగ్గరే ఉంచుకోండి. నేను ఎన్నో మ్యాచ్‌లు ఫినిష్ చేశాను” అంటూ ఘాటుగా సమాధానం ఇచ్చాడు.

పాకిస్తాన్ సూపర్ లీగ్ (PSL)లో భాగంగా జరిగిన మ్యాచ్‌లో పెషావర్ జల్మీ జట్టు 146 పరుగుల లక్ష్యాన్ని చేధించింది. ఈ మ్యాచ్‌లో బాబర్ ఆజమ్ 37 బంతుల్లో 43 పరుగులు చేసి జట్టుకు టాప్ స్కోరర్‌గా నిలిచాడు.

అయితే, 15వ ఓవర్‌లో అవుట్ కావడంతో మ్యాచ్ కాస్త ఉత్కంఠగా మారింది. చివరి ఓవర్లో 14 పరుగులు అవసరమైన పరిస్థితిలో, జల్మీ జట్టు చివరకు విజయం సాధించింది.

Also Read:ఇరాన్‌తో చర్చలకు అమెరికా ఉపాధ్యక్షుడు

హైదరాబాద్ కింగ్స్‌మెన్ జట్టు మొదట బ్యాటింగ్ చేసి 145 పరుగులు చేసింది. ప్రారంభంలో 34/4తో కష్టాల్లో పడిన జట్టును కుషాల్ పెరీరా 58 పరుగులతో రాణించాడు. హైదరాబాద్ కింగ్స్‌మెన్ ఈ సీజన్‌లో వరుసగా నాలుగో ఓటమి చవిచూసి … ఒక్క విజయం కూడా నమోదు చేయలేదు.

 

- Advertisement -