14న బీహార్‌కు కొత్త సీఎం!

10
- Advertisement -

బిహార్ రాజకీయాల్లో కీలక మార్పులు చోటుచేసుకునే అవకాశం కనిపిస్తోంది. ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్ రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణస్వీకారం చేయనున్న నేపథ్యంలో రాష్ట్రంలో నాయకత్వ మార్పు జరగనున్నట్లు సమాచారం. రాజ్యసభకు ఎన్నికైన నితీశ్ కుమార్ శుక్రవారం (ఏప్రిల్ 10) ఢిల్లీలో ఎంపీగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. అనంతరం అదే రోజు పాట్నాకు తిరిగి వెళ్లి బిహార్ కేబినెట్ సమావేశంలో పాల్గొననున్నారు.

ఏప్రిల్ 13న కేబినెట్ సమావేశం జరగనుండగా తన వారసుడిపై ఎంపికపై చర్చించనున్నట్లు సమాచారం. అలాగే ఏప్రిల్ 14 నితీశ్ కుమార్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసే అవకాశం ఉంది.

ఏప్రిల్ 14న ఎన్డీయే కూటమి సమావేశాలు జరిగి కొత్త ముఖ్యమంత్రిపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఏప్రిల్ 15న పాట్నాలోని గాంధీ మైదాన్‌లో కొత్త ముఖ్యమంత్రి ప్రమాణస్వీకారం చేయనున్నట్లు తెలుస్తోంది.

బీజేపీకి చెందిన పలువురు నేతలు ముఖ్యమంత్రి రేసులో ఉన్నారు.. ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరి, నిత్యానంద్ రాయ్, విజయ్ కుమార్ సిన్హా, సంజీవ్, నితీశ్‌ మిశ్రా, దిలీప్‌ జైస్వాల్, రామ్ కృపాల్ యాదవ్ సీఎం రేసులో ఉన్నారు. ఇదిలా ఉండగా, నితీశ్ కుమార్ కుమారుడు నిశాంత్ ఇటీవల జేడీయూలో చేరడం కూడా చర్చనీయాంశమైంది. ఆయనకు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వొచ్చని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

బిహార్ అసెంబ్లీలో అతిపెద్ద పార్టీగా ఉన్న బీజేపీ తదుపరి ప్రభుత్వాన్ని నడిపించే అవకాశం ఉంది. ఈ మార్పు రాష్ట్ర రాజకీయాల్లో పెద్ద పరిణామంగా భావిస్తున్నారు.

Also Read:ఇరాన్‌తో చర్చలకు అమెరికా ఉపాధ్యక్షుడు

- Advertisement -