బీజేపీలో తారాస్థాయికి అంతర్గతపోరు!

6
- Advertisement -

తెలంగాణ బీజేపీలో అంతర్గత పోరు తారాస్థాయికి చేరింది. తాను పార్టీ కార్యకలాపాలకు వ్యతిరేకంగా పని చేస్తున్నానని, బూతులు మాట్లాడుతున్నానని, తనపై బీజేపీ రాజ్యసభ ఎంపీ లక్ష్మణ్ అధిష్టానానికి ఫిర్యాదు చేశాడని మీడియాతో చిట్ చాట్ లో తెలిపారు ఎంపీ ధర్మపురి అరవింద్.

సీఎస్ఆర్ నిధుల కోసం లేఖ రాశానని, అసలు పార్టీలో లేఖల సంస్కృతి లేదని తెలిపారు లక్ష్మణ్. అయితే త్వరలో కేంద్ర కేబినెట్ విస్తరణ జరగనుందని, అందులో తెలంగాణ నుండి ఒకరికి మంత్రి పదవి దక్కే అవకాశం ఉందని, అందుకే లేఖల ద్వారా ఫిర్యాదుల పర్వం నడుస్తుందని బీజేపీ కార్యకర్తల్లో జోరుగా చర్చలు జరుగుతున్నాయి.

2004 నుండి తెలంగాణలో 5 సార్లు అసెంబ్లీ ఎన్నికలు జరిగితే, బీజేపీ కేవలం 18 స్థానాల్లో మాత్రమే గెలిచిందని, అది గూగుల్లో చూసినా తెలుస్తుందని, దానికి లేఖ రాసి స్టేషనరీ దండగ చేయడం ఎందుకని లక్ష్మణ్ మీద సెటైర్లు వేశారు అరవింద్.పార్టీలో జరుగుతున్న అంతర్గత విభేదాల గురించి ఫిర్యాదు చేస్తూ, మరికొందరు ఎంపీలు కూడా బీజేపీ అధిష్టానానికి లేఖలు రాశారని సమాచారం.

ALso Read:ఇరాన్‌తో చర్చలకు అమెరికా ఉపాధ్యక్షుడు

- Advertisement -