క్రికెట్ అభిమానులను నిరాశపరుస్తూ కోల్కతా నైట్రైడర్స్ మరియు పంజాబ్ కింగ్స్ మధ్య జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దైంది. సోమవారం సాయంత్రం ఈడెన్ గార్డెన్ మైదానంలో ఈ మ్యాచ్ జరగాల్సి ఉంది.
టాస్ గెలిచిన కోల్కతా నైట్రైడర్స్ జట్టు మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. ప్రారంభంలోనే జట్టు కాస్త ఒత్తిడికి లోనై, 3.4 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 25 పరుగులు చేసింది.అయితే మ్యాచ్ కొనసాగుతున్న సమయంలో అకస్మాత్తుగా భారీ వర్షం కురవడంతో ఆట నిలిచిపోయింది. కొంతసేపు వర్షం ఆగుతుందని ఆశించినా, పరిస్థితులు అనుకూలించకపోవడంతో అంపైర్లు మ్యాచ్ను రద్దు చేశారు.
మ్యాచ్ కోసం ఆసక్తిగా ఎదురుచూసిన అభిమానులకు ఇది పెద్ద నిరాశగా మారింది. ముఖ్యంగా Punjab Kings అభిమానులు కూడా మ్యాచ్ జరగకపోవడంతో అసంతృప్తి వ్యక్తం చేశారు.మ్యాచ్ రద్దు కావడంతో రెండు జట్లకు ఒక్కో పాయింట్ కేటాయించారు. టోర్నమెంట్లో ప్రతి పాయింట్ కీలకమవుతున్న ఈ దశలో, ఈ పరిణామం రెండు జట్లపై ప్రభావం చూపే అవకాశం ఉంది.
Also Read;‘గాయపడ్డ సింహం’లో జేడి!

