ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి కీలక నిర్ణయం వెలువడింది. అమరావతిని అధికారిక రాజధానిగా ప్రకటిస్తూ కేంద్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నిర్ణయంతో రాష్ట్ర రాజకీయాల్లో, పరిపాలనలో కొత్త అధ్యాయం ప్రారంభమైంది.
కేంద్ర ప్రభుత్వం..ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం 2014లోని సెక్షన్ 5, సబ్ సెక్షన్ 2లో సవరణ చేస్తూ అమరావతిని ఆంధ్రప్రదేశ్ రాజధానిగా స్పష్టంగా చేర్చింది. ఈ నిర్ణయం 2024 జూన్ 2 నుంచి అమలులోకి వస్తుందని అధికారిక ప్రకటనలో పేర్కొంది.
ఈ నిర్ణయానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలిపారు. ఈ పరిణామంపై ఏపీ సీఎం చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. సోషల్ మీడియా వేదిక “X” ద్వారా రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఆయన ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. అలాగే ప్రధాని నరేంద్ర మోడీకు కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర అభివృద్ధికి అండగా నిలిచినందుకు కృతజ్ఞతలు తెలిపారు.
అమరావతిని అధికారిక రాజధానిగా ప్రకటించడం ద్వారా పరిపాలనా స్థిరత్వం పెరుగుతుందని, పెట్టుబడులు, అభివృద్ధి ప్రాజెక్టులకు ఊతం లభిస్తుందని ప్రభుత్వం భావిస్తోంది. ఈ నిర్ణయం ఆంధ్రప్రదేశ్ భవిష్యత్ అభివృద్ధికి కీలక మలుపుగా మారే అవకాశముంది.
Also Read:‘గాయపడ్డ సింహం’లో జేడి!

