పార్టీ మారిన ఎమ్మెల్యేల..పెన్షన్ రద్దు!

8
- Advertisement -

హిమాచల్‌ ప్రదేశ్ ప్రభుత్వం కీలక బిల్లును ప్రవేశపెట్టింది. ఎమ్మెల్యేల పార్టీ మార్పులను (డిఫెక్షన్లు) అరికట్టేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. బడ్జెట్ సమావేశాల్లో “హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ అలవెన్సెస్ అండ్ పెన్షన్ (సవరణ) బిల్లు–2026”ను ప్రవేశపెట్టింది.

ఈ బిల్లు ప్రకారం… రాజ్యాంగంలోని ఆంటీ-డిఫెక్షన్ చట్టం కింద అనర్హులుగా ప్రకటించబడిన ఎమ్మెల్యేలకు పెన్షన్ మరియు శాశ్వత ప్రయోజనాలు అందవు.

సవరణ బిల్లులో ముఖ్య అంశాలు

14వ అసెంబ్లీ నుంచి ఎన్నికైన సభ్యులు పార్టీ మార్పుల వల్ల అనర్హులైతే → పెన్షన్ హక్కు రద్దు
1971 చట్టంలోని సెక్షన్ 6-Bలో కొత్తగా (2-A) ఉపవిభాగం చేర్చారు
ప్రజా తీర్పుకు విరుద్ధంగా పార్టీలు మారడాన్ని నిరోధించడం లక్ష్యం

ప్రస్తుతం ఉన్న చట్టంలో ఈ అంశంపై కఠిన నిబంధనలు లేకపోవడంతో, ఎమ్మెల్యేలు ఎన్నికల తర్వాత పార్టీలు మార్చే పరిస్థితులు ఏర్పడుతున్నాయని ప్రభుత్వం పేర్కొంది.

ప్రస్తుత పెన్షన్ వ్యవస్థ

ఒక ఎమ్మెల్యే పూర్తి 5 ఏళ్ల పదవీకాలం పూర్తి చేస్తే → నెలకు ₹50,000 పెన్షన్
అదనపు పదవీకాలాలకు → ప్రతి ఏడాదికి ₹1,000 అదనంగా
2030 నుంచి → ప్రతి 5 ఏళ్లకు ఒకసారి ద్రవ్యోల్బణ సూచిక ప్రకారం పెన్షన్ సవరణ
ఎమ్మెల్యే మరణిస్తే → కుటుంబానికి 50% పెన్షన్

ఈ బిల్లుతో వచ్చే మార్పు

పార్టీ మారితే కేవలం రాజకీయ పరిణామాలే కాకుండా
ఆర్థిక నష్టాలు కూడా ఎదురవుతాయి

దీంతో ఎమ్మెల్యేలు పార్టీ మార్పు నిర్ణయంపై రెండుసార్లు ఆలోచించే అవకాశముందని విశ్లేషకులు భావిస్తున్నారు. 2024 రాజ్యసభ ఎన్నికల సమయంలో 6 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్ చేశారు. దీంతో BJP అభ్యర్థి హర్ష్ మహాజన్ గెలిచారు.

Also Read:బీజేపీలో చేరిన ఆప్ నేత ఫూల్కా!

పార్టీ విప్ ఉల్లంఘన కారణంగా అనర్హులైన వారు:

సుధీర్ శర్మ
రాజేంద్ర రాణా
ఇంద్ర దత్ లక్షణ్‌పాల్
రవి ఠాకూర్
చైతన్య శర్మ
దేవేంద్ర భుట్టో

వీరిలో .. చైతన్య శర్మ, దేవేంద్ర భుట్టో తొలిసారి ఎమ్మెల్యేలు. ఈ సవరణ ప్రకారం వీరు పెన్షన్ & ఇతర ప్రయోజనాలు కోల్పోతారు.

- Advertisement -