116 మందితో టీబీజేపీ కార్యవర్గం

8
- Advertisement -

తెలంగాణలో బీజేపీ సంస్థాగత బలోపేతానికి కీలక అడుగు పడింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు రాష్ట్ర కార్యవర్గ సభ్యుల జాబితాను అధికారికంగా ప్రకటించారు.బీజేపీ ఎమ్మెల్యేలు, ఎంపీలను రాష్ట్ర కార్యవర్గానికి శాశ్వత ఆహ్వానితులుగా నియమిస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. పార్టీ కార్యకలాపాల్లో వారి అనుభవం, మార్గదర్శకం ఉపయోగపడుతుందని పార్టీ భావిస్తోంది.

కొత్తగా ప్రకటించిన రాష్ట్ర కార్యవర్గంలో మొత్తం పెద్ద సంఖ్యలో నాయకులకు అవకాశం కల్పించారు.రాష్ట్ర కార్యవర్గ సభ్యులు – 116 మంది కాగా ప్రత్యేక ఆహ్వానితులు – 62 మంది,ప్రత్యేక శాశ్వత ఆహ్వానితులు – 20 మంది ఉన్నారు.

ఈ జాబితా ద్వారా పార్టీ అన్ని వర్గాలకు ప్రాతినిధ్యం కల్పించడానికి ప్రయత్నించినట్లు తెలుస్తోంది. రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని, బూత్ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పార్టీని మరింత బలోపేతం చేయాలనే లక్ష్యంతో ఈ కార్యవర్గాన్ని ఏర్పాటు చేసినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

తెలంగాణలో బీజేపీ సంస్థాగత నిర్మాణాన్ని విస్తరించేందుకు ఈ కొత్త కార్యవర్గం కీలకంగా మారనుంది. కొత్త బాధ్యతలతో నాయకులు పార్టీ అభివృద్ధికి పనిచేస్తారని బీజేపీ ఆశాభావం వ్యక్తం చేస్తోంది.

Also Read:దూబే..సీఎస్‌కేకు కీలకం కానున్నాడా?

- Advertisement -