ఐపీఎల్ 2026లో ముంబై ఇండియన్స్ మరియు కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య జరిగిన మ్యాచ్ తర్వాత ఒక ఆసక్తికర చర్చ మొదలైంది. టీమిండియా టీ20 వరల్డ్ కప్ విజేత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌ను ఇంపాక్ట్ సబ్‌గా వినియోగించడం చర్చనీయాంశమైంది.
ఈ విషయంపై ముంబై ఇండియన్స్ హెడ్ కోచ్ మహేళ జయవర్ధనే స్పందిస్తూ అన్ని ఊహాగానాలకు చెక్ పెట్టారు.అనవసర కథలు సృష్టించకండి. మా టీమ్‌లో అందరూ సంతోషంగా ఉన్నారు. సూర్యకుమార్ యాదవ్‌కు స్వల్పంగా గ్రోయిన్ ఇంజరీ ఉంది. అతనికి కొంత విశ్రాంతి ఇవ్వడానికి ఈ నిర్ణయం తీసుకున్నాంఅని చెప్పారు.
సూర్యకుమార్ యాదవ్‌ను ఇంపాక్ట్ ప్లేయర్‌గా ఉపయోగించడం వెనుక ఎలాంటి వివాదం లేదని జయవర్ధనే స్పష్టం చేశారు. జట్టు ప్రయోజనాల దృష్ట్యా తీసుకున్న నిర్ణయమని, అనవసర ఊహాగానాలకు తావులేదని ఆయన తేల్చిచెప్పారు.
బ్యాటింగ్‌కు వచ్చిన సూర్యకుమార్ యాదవ్ 8 బంతుల్లో 16 పరుగులు చేసి ఔటయ్యాడు. ఆయన కార్తిక్ త్యాగి బౌలింగ్‌లో ఔటయ్యాడు.ముంబై ఇండియన్స్ 221 పరుగుల లక్ష్యాన్ని సునాయాసంగా ఛేదించింది.
Also Read:కొవిడ్ కొత్త వేరియంట్..లక్షణాలివే!
రోహిత్ శర్మ – 78 పరుగులు,ర్యాన్ రికెల్టన్ – 81 పరుగులు..ఈ ఇద్దరూ కలిసి 148 పరుగుల ఓపెనింగ్ పార్ట్నర్‌షిప్ నమోదు చేశారు.చివర్లో నమన్ ధీర్ ఫోర్ కొట్టి జట్టుకు విజయం అందించాడు.ముందుగా బ్యాటింగ్ చేసిన కోల్‌కతా నైట్ రైడర్స్ 20 ఓవర్లలో 220/4 స్కోర్ చేసింది.

