చరణ్‌కు సైడ్ ఇచ్చిన అఖిల్!

9
- Advertisement -

అఖిల్ అక్కినేని నటిస్తున్న తాజా చిత్రం “లెనిన్” విడుదల వాయిదా పడింది. మురళి కిషోర్ అబ్బూరు దర్శకత్వం వహిస్తుండగా గ్రామీణ నేపథ్యంలో రూపొందుతోంది. అఖిల్ సరసన హీరోయిన్‌గా భాగ్యశ్రీ బోర్సే నటిస్తుండగా ఈ సినిమాను మే 1న విడుదల చేయాలని ప్లాన్ చేయగా తాజాగా రిలీజ్ డేట్ పోస్ట్ పోన్ అయినట్లు తెలుస్తోంది.

రామ్ చరణ్‌ నటిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం “పెద్ది” (ఏప్రిల్ 30 విడుదల)కి బాక్సాఫీస్ వద్ద మంచి అవకాశాన్ని ఇవ్వడానికి తీసుకున్నట్లు సమాచారం. సాధారణంగా పెద్ద సినిమాలు విడుదలయ్యే సమయంలో చిన్న, మధ్యస్థాయి సినిమాలు వాయిదా వేయడం ఆనవాయితీ.

అఖిల్ మరియు రామ్ చరణ్ మధ్య ఉన్న స్నేహం కూడా ఈ నిర్ణయానికి ప్రధాన కారణంగా చెప్పబడుతోంది. ఇండస్ట్రీకి ఉపయోగపడే విధంగా నటులు ఇలాంటి వ్యాపార నిర్ణయాలు తీసుకోవడం మంచి పరిణామంగా భావిస్తున్నారు.

ఈ చిత్రంలో శివాజీ కీలక పాత్ర పోషిస్తున్నారు. నాగవంశీ, నాగార్జున నిర్మిస్తున్న ఈ సినిమా, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ , అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్లపై తెరకెక్కుతోంది.

Also Read:పొంగులేటి అక్రమ మైనింగ్‌పై చర్యలేవి?

- Advertisement -