మంచిరేవులలో ఓంకారేశ్వర ఆలయం

3
- Advertisement -

తెలంగాణలో భారీ ఆధ్యాత్మిక ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు సీఎం రేవంత్ రెడ్డి. మంచిరేవులలో ఓంకారేశ్వర ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

ఈ ఆలయ నిర్మాణం శృంగేరి శారద పీఠం సూచనల మేరకు జరగనుంది. ఆధ్యాత్మిక పరంగా విశిష్టతను కలిగించే విధంగా ఆలయ నిర్మాణానికి ప్రణాళికలు రూపొందించారు.

ప్రాజెక్టులో భాగంగా మూసీ నది మధ్యలో సుమారు 100 అడుగుల ఎత్తులో భారీ శివుడి విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఇది ఈ ప్రాజెక్టుకు ప్రధాన ఆకర్షణగా నిలవనుంది.మూసీ ఆధ్యాత్మిక ప్రాజెక్టుకు సుమారు రూ.700 కోట్లు వెచ్చించనున్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా ప్రాంతాన్ని ఆధ్యాత్మిక, పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

ఈ ప్రాజెక్టులో భాగంగా మూసీ పరివాహక ప్రాంతంలో నాలుగు మతాలకు చెందిన ప్రార్థన మందిరాలను నిర్మించాలని నిర్ణయించారు.పురానాపూల్ వద్ద మసీదు, గౌలిగూడలో గురుద్వారా,నాగోల్ వద్ద చర్చి నిర్మాణం చేపట్టనున్నారు. భక్తులతో పాటు పర్యాటకులను ఆకర్షించే విధంగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.

Also Read:జుట్టు ఊడిపోవడం…పరిష్కారం!

- Advertisement -