అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ … వ్యూహాత్మకంగా కీలకమైన హర్మూజ్ జలసంధిని ట్రంప్ జలసంధిగా పేర్కొన్నారు. అనంతరం వెంటనే హోర్ముజ్ అని సరిదిద్దుకుంటూ…ఇది పొరపాటు కాదు, నా దగ్గర యాదృచ్ఛికాలు ఉండవు అని వ్యాఖ్యానించారు. ఫేక్ న్యూస్ ఇది తప్పుగా చెప్పాడని చెబుతుంది, కానీ నా దగ్గర అలాంటివి జరగవు అన్నారు.
ఈ సందర్భంగా ట్రంప్ ఇరాన్‌పై కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ ప్రస్తుతం ఒత్తిడిలో ఉందని, చర్చలకు సిద్ధంగా ఉందని ఆయన తెలిపారు. జరుగుతున్న చర్చలలో భాగంగా టెహ్రాన్ పలు ఆయిల్ సరఫరాలు పంపిందని కూడా ఆయన పేర్కొన్నారు. వారు ఒప్పందం కోసం వేడుకుంటున్నారు. చర్చలు కొనసాగుతున్నాయి అని ట్రంప్ అన్నారు. ప్రపంచ చమురు రవాణాలో అత్యంత కీలక మార్గమైన హోర్ముజ్ జలసంధిని తెరవడం ఏ ఒప్పందానికైనా ముఖ్య అంశమని ఆయన స్పష్టం చేశారు.
ట్రంప్ మాట్లాడుతూ…వారిపై తీవ్ర ఒత్తిడి ఉంది. ఎవరైనా ఈ పరిస్థితిలో చర్చలకు వస్తారు. వారు నిజంగానే చర్చలు చేస్తున్నారు. మొదట వారు ఖండించినప్పటికీ, రెండు రోజుల తర్వాత అంగీకరించారు. వారు ఎనిమిది ఆయిల్ షిప్‌లు పంపుతామని చెప్పారు. తర్వాత మరొక రెండు జతచేశారు. మొత్తంగా పది షిప్‌లు వచ్చాయి. అప్పుడే ప్రజలకు చర్చలు జరుగుతున్నాయని అర్థమైంది అని వివరించారు.
అదే సమయంలో, హోర్ముజ్ జలసంధిని పూర్తిగా తిరిగి ప్రారంభించాలని ట్రంప్ ఇరాన్‌ను డిమాండ్ చేశారు. లేకపోతే అమెరికా ఇరాన్ విద్యుత్ కేంద్రాలను పూర్తిగా ధ్వంసం చేస్తుంది అని హెచ్చరించారు. అయితే, టెహ్రాన్‌తో చర్చలు కొనసాగుతున్న నేపథ్యంలో గడువును మరో 10 రోజుల పాటు పొడిగించారు. ప్రస్తుతం కొత్త గడువు ఏప్రిల్ 6గా నిర్ణయించారు.
Also Read:జుట్టు ఊడిపోవడం…పరిష్కారం!

