Dhurandhar 2: The Revenge బాక్సాఫీస్ వద్ద అద్భుత విజయాన్ని సాధిస్తోంది. ఈ చిత్రంలో రణ్‌వీర్ సింగ్ నటన ప్రేక్షకులను ఆకట్టుకుంటూ భారీ వసూళ్లను రాబడుతోంది. విడుదలైన 8 రోజుల్లోనే ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.1060 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది.
ఈ చిత్రం భారతదేశంలోనే సుమారు రూ.800 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించి రికార్డులు సృష్టిస్తోంది. రోజురోజుకు మంచి కలెక్షన్లు నమోదు చేస్తూ రెండో వారం కూడా బలంగా కొనసాగుతోంది.
గతంలో భారీ హిట్ అయిన పఠాన్ , కల్కి 2898 AD చిత్రాల లైఫ్‌టైమ్ వసూళ్లను అధిగమించడం విశేషంగా మారింది. దర్శకుడు ఆదిత్య దర్ తెరకెక్కించిన ఈ స్పై థ్రిల్లర్ చిత్రం ప్రేక్షకుల నుంచి భారీ స్పందన పొందుతోంది. విడుదలైన కేవలం వారం రోజుల్లోనే రూ.1000 కోట్ల క్లబ్‌లో చేరి బాలీవుడ్‌లో వేగంగా ఈ మైలురాయిని చేరిన చిత్రంగా నిలిచింది.
దేశీయంగా మాత్రమే కాకుండా విదేశాల్లో కూడా ఈ సినిమాకు మంచి ఆదరణ లభిస్తోంది. అమెరికా సహా అనేక దేశాల్లో ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు సాధిస్తోంది. మొత్తంగా చూస్తే, “ధురంధర్ 2” ప్రస్తుతం ఇండియన్ సినిమా చరిత్రలోనే అత్యంత వేగంగా రికార్డులు బద్దలు కొడుతున్న సినిమాలలో ఒకటిగా నిలుస్తోంది.
Also Read:శ్రీరామ నవమి విశిష్టత

