ఐపీఎల్ 2026 త్వరలో ప్రారంభం కానుండగా శ్రీలంక క్రికెట్ బోర్డు ఆటగాళ్లకు అనుమతినిస్తూ నిర్ణయం తీసుకుంది. ఐపీఎల్ 2026 కోసం ఇషాన్ మాలింగా కు అనుమతి ఇచ్చింది. అయితే వనిందు హసరంగా, నువాన్ తుషారా, మతీష పతిరాణల విషయంపై ఇంకా స్పష్టత రాలేదు.
ముఖ్యమైన పరిణామంగా, ఎస్‌ఎల్‌సీ ఇషాన్ మాలింగా కు ఐపీఎల్‌లో పాల్గొనడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మాలింగా మార్చి 24న ఎస్‌ఆర్‌హెచ్ జట్టులో చేరనున్నారు.
మాలింగా తో పాటు కమిందు మెండిస్ కూడా హైదరాబాద్‌కు రానున్నారు. వీరికి ఎన్‌ఓసీ (No Objection Certificate) మంజూరైంది. అయితే నువాన్ తుషారా, వనిందు హసరంగా, మతీష పతిరాణలపై ఇంకా ఎలాంటి సమాచారం లేదు.
హసరంగా మరియు పతిరాణ ఇంకా ఫిట్‌నెస్ పరీక్షలకు హాజరు కాలేదు. అందువల్ల వీరి భారత్ రాక ఆలస్యం అయ్యే అవకాశం ఉంది.ఇక నువాన్ తుషారా విషయానికి వస్తే, ఆయన ఎన్‌ఓసీ అర్హత ఫిట్‌నెస్ పరీక్ష ఫలితంపై ఆధారపడి ఉంటుందని ఎస్‌ఎల్‌సీ వెల్లడించింది.
ఇతర శ్రీలంక ఆటగాళ్లలో దుశ్మంత చమీరా, పథుమ్ నిస్సంకా , దసున్ శనక ఇప్పటికే క్లియరెన్స్ పొందారు.
Also Read:వరల్డ్ వైడ్‌గా గాయపడ్డ సింహం!

