పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధం 25వ రోజుకు చేరుకుంది. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఐదు రోజుల యుద్ధ విరామాన్ని ప్రకటించడం అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది.
అయితే, ట్రంప్ ప్రకటన తర్వాత కూడా ఇరాన్ తన దాడులను తగ్గించకుండా కొనసాగిస్తోంది. ముఖ్యంగా బాలిస్టిక్ క్షిపణులతో దాడులు కొనసాగిస్తున్నట్లు సమాచారం. యుద్ధ విరామం విషయంపై ఇరాన్ ఘాటుగా స్పందించింది.
అమెరికాతో ఎలాంటి శాంతి చర్చలు జరపడం లేదని ఇరాన్ స్పష్టంచేసింది. ట్రంప్ చేసిన ప్రకటనలను “అబద్దపు ప్రచారం”గా పేర్కొంటూ, ఇది అంతర్జాతీయ వేదికపై నాటకం ఆడటమేనని విమర్శించింది.
Also Read:వరల్డ్ వైడ్‌గా గాయపడ్డ సింహం!
ఇదిలా ఉంటే, ట్రంప్ ప్రకటించిన యుద్ధ విరామాన్ని తమ దేశ విజయంగా ఇరాన్ మీడియా ప్రచారం చేస్తోంది. ఇరాన్ దాడులకు భయపడి ట్రంప్ వెనక్కి తగ్గారని కథనాలు ప్రచారం చేస్తున్నాయి.
ఈ పరిణామాలు యుద్ధ పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారే అవకాశాలను సూచిస్తున్నాయి. అంతర్జాతీయ సమాజం మాత్రం ఇరు దేశాలు శాంతి దిశగా అడుగులు వేయాలని కోరుతోంది.

