మధ్యప్రాచ్యంలో ఉద్రిక్త పరిస్థితులు మరింత తీవ్రమవుతున్నాయి. ఇరాన్ మరియు ఇజ్రాయెల్ మధ్య కొనసాగుతున్న దాడులు యుద్ధ వాతావరణాన్ని మరింత వేడెక్కిస్తున్నాయి.
ఇజ్రాయెల్ దళాలు టెహ్రాన్‌ను లక్ష్యంగా చేసుకుని క్షిపణి దాడులు జరిపినట్లు సమాచారం. ముఖ్యంగా మిలటరీ హెడ్‌క్వార్టర్స్, నిఘా సంస్థలు, ఖుద్స్ ఫోర్స్‌కు చెందిన స్థావరాలపై దాడులు జరిగాయని నివేదికలు చెబుతున్నాయి.
బెరూట్ దక్షిణ శివారు ప్రాంతాల్లో కూడా ఇజ్రాయెల్ భారీ బాంబు దాడులు చేపట్టింది. ఈ దాడుల్లో ఒక గ్యాస్ స్టేషన్ కూడా లక్ష్యంగా మారినట్లు తెలుస్తోంది.
అదేవిధంగా, ఇరాన్ తీర ప్రాంతాలు మరియు కీలక నౌకాశ్రయాలపై కూడా ఇజ్రాయెల్ దాడులు కొనసాగిస్తున్నట్లు సమాచారం. ఇరాన్–రష్యా మధ్య సరఫరా వ్యవస్థను దెబ్బతీయాలనే ఉద్దేశంతో ఈ పోర్టులను లక్ష్యంగా చేసుకున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.
ఈ పరిణామాలు ప్రాంతీయ భద్రతకు ముప్పుగా మారే అవకాశం ఉన్నందున, అంతర్జాతీయ సమాజం ఆందోళన వ్యక్తం చేస్తోంది. పరిస్థితులు మరింత విషమించకుండా ఇరు దేశాలు నియంత్రణ పాటించాలని పిలుపునిస్తోంది.
Also Read:వరల్డ్ వైడ్‌గా గాయపడ్డ సింహం!

