భారత క్రికెటర్ రోహిత్ శర్మపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు రవిచంద్రన్ అశ్విన్. రాబోయే ఐపీఎల్ 2026లో ముంబై ఇండియన్స్ తరఫున రోహిత్ అద్భుత ప్రదర్శన చేస్తాడని ఆశాభావం వ్యక్తం చేశారు.
టోర్నీ ప్రారంభానికి ముందు మాట్లాడుతూ అశ్విన్, రోహిత్ శర్మ ఈసారి అద్భుతంగా ఆడే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. ఈ సీజన్‌లో రోహిత్ పూర్తిగా రాణిస్తాడని నేను భావిస్తున్నాను. అతనికి సరిపడ విశ్రాంతి లభించింది. అతని మనసు తాజాగా ఉంది. శారీరకంగా కూడా మంచి స్థితిలో ఉన్నాడు. అతను చాలా ఫిట్‌గా కనిపిస్తున్నాడు. ఈ సీజన్‌లో అతను తన టీ20 బ్యాటింగ్‌ను మళ్లీ ప్రదర్శించగలడని అనుకుంటున్నాను అని అశ్విన్ తన యూట్యూబ్ ఛానెల్‌లో పేర్కొన్నారు.
ముంబై ఇండియన్స్ జట్టు బలాన్ని గురించి మాట్లాడుతూ అశ్విన్ పెద్ద అంచనాలు వ్యక్తం చేశారు. జట్టు కూర్పు బలంగా ఉందని, ఈసారి టాప్-5లోకి రాకపోతే అది తనకు పెద్ద ఆశ్చర్యంగా ఉంటుందని చెప్పారు. ఈ ఏడాది ముంబై ఇండియన్స్ టాప్-2లోకి రాకపోతే అది నాకు పెద్ద షాక్ అవుతుంది. వారు చాలా బలమైన జట్టును సిద్ధం చేశారు. కనీసం టాప్-4లోకి రావడం ఖాయం. కానీ ఉత్తమ ప్రదర్శన అంటే వారు నేరుగా ఫస్ట్ ప్లేస్‌లో నిలవడమే అని అశ్విన్ అభిప్రాయపడ్డారు.
Also Read:రోజూ తినే ఈ స్నాక్స్‌తో మీ ఆరోగ్యం ఖతం!
19వ సీజన్‌కు సిద్ధమవుతున్న ఐపీఎల్ మార్చి 28న ప్రారంభం కానుంది. ఈ టోర్నీలో 10 జట్లు టైటిల్ కోసం పోటీ పడనున్నాయి. ఐదు సార్లు ఛాంపియన్ అయిన ముంబై ఇండియన్స్‌పై ఈసారి ప్రత్యేక దృష్టి ఉంది.

