మొక్కజొన్న రైతులను ఆదుకొని మద్దతు ధర ఇవ్వడంతో పాటు రూ. 500 బోనస్ ఇచ్చి, కొనుగోలు కేంద్రాలను తక్షణం ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ గన్ పార్క్ అమరవీరుల స్తూపం వద్ద బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఆందోళన చేపట్టారు.
చేతుల్లో మొక్కజొన్న కంకులు పట్టుకుని రైతులకు మద్దతుగా నిరసన తెలిపారు. అనంతరం అక్కడి నుంచి నిరసన తెలుపుతూ అసెంబ్లీకి వస్తున్న బీఆర్ఎస్ సభ్యులను ఎంట్రీ పాయింట్ వద్ద పోలీసులు, మార్షల్స్ అడ్డుకున్నారు.
ఈ క్రమంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలపై మార్షల్స్ దురుసుగా ప్రవర్తించారు. ప్రజాప్రతినిధులు అని కూడా చూడకుండా వారి చేతుల్లో ఉన్న మొక్కజొన్న కంకులను మార్షల్స్ లాక్కోవడంతో మాజీ మంత్రి హరీష్ రావు గారి చేతికి గాయమై రక్తం కారింది. పోలీసుల, మార్షల్స్ తీరుపై ఎమ్మెల్యేలు మండిపడ్డారు. అసెంబ్లీ లోపలికి వెళ్లే ద్వారం వద్ద నిరసన వ్యక్తం చేసిన సభ్యులు.. ప్రభుత్వ, పోలీసుల వైఖరి నశించాలంటూ నినాదాలు చేస్తూ సభలోకి వెళ్లారు.
Also Read:వినూత్నంగా ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ప్రమోషన్స్

