రేవంత్ విధానాలతో తెలంగాణకు నష్టం!

4
- Advertisement -

తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు కేటీఆర్. అధికార పక్షానికి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, అప్పుల స్థితిపై ఒక ప్రత్యేక ఓరియెంటేషన్ సెషన్ అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. తెలంగాణను దివాలా తీసిన రాష్ట్రంగా చూపించే ప్రయత్నాలు రాష్ట్రానికి నష్టం చేస్తాయని హెచ్చరించారు.

గతంలో కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం స్టేట్ ఓన్డ్ టాక్స్ రెవెన్యూలో దేశంలో అగ్రస్థానంలో నిలిచిందని, కానీ ప్రస్తుతం కాంగ్రెస్ పాలనలో ఆదాయం అంచనాలకు అందడం లేదని విమర్శించారు. ఒకప్పుడు ఉస్సేన్ బోల్ట్‌లా పరిగెత్తిన ఆర్థిక వ్యవస్థ ఇప్పుడు ఎందుకు మందగించిందో ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

రిజిస్ట్రేషన్ ఆదాయం, వాహనాల రిజిస్ట్రేషన్, జీఎస్టీ వృద్ధి తగ్గుముఖం పట్టాయని, మార్కెట్‌లో గిరాకీ లేకపోవడం వల్ల ఆర్థిక చక్రం స్తంభించిందని అన్నారు. తలసరి ఆదాయంలో దేశంలో అగ్రస్థానంలో ఉన్న తెలంగాణ ఇప్పుడు 6వ స్థానానికి పడిపోయిందని పేర్కొన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వం నెగటివ్ మైండ్‌సెట్, తప్పు విధానాలతో రాష్ట్రాన్ని వెనక్కి నెడుతోందని ఆరోపించారు. గ్లోబల్ సమిట్ పేరుతో భారీ పెట్టుబడుల ప్రచారం చేసినా, వాటిపై స్పష్టత లేదని, డావోస్ సమావేశం సహా మొత్తం పెట్టుబడులపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

ఫార్మా సిటీ కోసం సేకరించిన భూములను ఇప్పుడు “ఫ్యూచర్ సిటీ” పేరుతో వేరే విధంగా వినియోగించాలనుకోవడం ప్రజలను మోసం చేయడమేనని అన్నారు. గతంలో కాలుష్య పరిశ్రమలకు వ్యతిరేకంగా పోరాడిన కాంగ్రెస్ నేతలు ఇప్పుడు అదే ప్రాజెక్టులను ప్రోత్సహించడం విరుద్ధమని విమర్శించారు.

Also Read:ఖమేనీకి రక్షణగా నోపో బ్లాక్ క్యాట్స్!

రిజిస్ట్రేషన్ ఆదాయం కూడా గణనీయంగా పడిపోయిందని గణాంకాలు చూపుతున్నాయని తెలిపారు. 2023-24లో రూ.14,295 కోట్లు వచ్చిన ఆదాయం, 2024-25లో రూ.8,473 కోట్లకు పడిపోయిందని చెప్పారు. లక్ష్యంగా పెట్టుకున్న రూ.19,000 కోట్లలో జనవరి నాటికి కేవలం 64% మాత్రమే సాధించారని వెల్లడించారు.మొత్తంగా, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ క్షీణతకు కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలే కారణమని, ప్రజల్లో నమ్మకం కోల్పోయిందని కేటీఆర్ విమర్శించారు.

- Advertisement -