ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి నెతన్యాహు గురించి సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోపై కొత్త వివాదం చెలరేగింది. నెతన్యాహు కాఫీ తాగుతున్న వీడియోను కొందరు అడ్వాన్స్‌డ్ AI డీప్‌ఫేక్ వీడియోగా ప్రచారం చేయగా, దీనిపై ప్రముఖ AI చాట్‌బాట్ Grok స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేసింది.
మొదట ఈ వీడియోను అత్యాధునిక AI టూల్స్‌తో తయారు చేసిన డీప్‌ఫేక్ కావచ్చని గ్రోక్ అభిప్రాయం వ్యక్తం చేసింది. ఈ వ్యాఖ్యలు బయటకు రావడంతో సోషల్ మీడియాలో పెద్ద చర్చ మొదలైంది. ఇదే సమయంలో నెతన్యాహు మరణించారంటూ కొన్ని వదంతులు కూడా ప్రచారంలోకి రావడంతో పరిస్థితి మరింత గందరగోళంగా మారింది.
ఈ ప్రచారాలన్నింటికీ చెక్ పెట్టేందుకు నెతన్యాహు అధికారిక సోషల్ మీడియా ఖాతా నుంచి ఆయన కాఫీ తాగుతున్న వీడియోను విడుదల చేశారు. దీంతో ఆ వీడియో నిజమా కాదా అన్న దానిపై మరోసారి చర్చ మొదలైంది.
ఇదిలా ఉండగా వీడియోలో నెతన్యాహు చేతికి ఆరు వేళ్లు ఉన్నట్టు కనిపించడం కూడా అనుమానాలకు కారణమైంది. అయితే దీనిపై మరోసారి స్పందించిన గ్రోక్, ఆ వీడియో AI ద్వారా తయారైనదని చెప్పేందుకు ఆధారాలు లేవని స్పష్టం చేసింది. కెమెరా యాంగిల్ మరియు ఫ్రేమ్‌లో ఏర్పడిన విజువల్ భ్రమ వల్ల ఆరు వేళ్లు ఉన్నట్టు కనిపించిందని వివరించింది.
Also Read:OTT:ఈ వారం ఓటీటీ సినిమాలివే
దీంతో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోపై ఉన్న అనుమానాలు కొంతవరకు తొలగినట్టయ్యాయి.

