భారత్ చేతిలో ఓటమి ఇప్పటికి బాధిస్తుంది!

7
- Advertisement -

2016 టీ20 వరల్డ్ కప్‌లో భారత్ చేతిలో ఎదురైన హృదయ విదారక ఓటమిని గుర్తు చేసుకున్నారు బంగ్లాదేశ్ మాజీ క్రికెటర్ మహ్మదుల్లా . ఆ మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌కు చివరి మూడు బంతుల్లో కేవలం రెండు పరుగులు అవసరం ఉండగా, చివరి మూడు బంతుల్లో మూడు వికెట్లు కోల్పోయి ఒక్క పరుగుతో మ్యాచ్‌ను కోల్పోయింది.

2016 ICC T20 World Cupలో బెంగళూరులోని చిదంబరం స్టేడియంలో జరిగిన మ్యాచ్ భారత్‌కు తప్పనిసరి విజయం కావాల్సింది. చివరి మూడు బంతుల్లో బంగ్లాదేశ్‌కు రెండు పరుగులు కావాల్సి ఉండగా రహీమ్ భారీ షాట్ ఆడేందుకు ప్రయత్నించి అవుట్ అయ్యాడు. తరువాతి బంతిలో మహ్ముదుల్లా కూడా అదే ప్రయత్నం చేసి క్యాచ్ ఇచ్చాడు. చివరి బంతి ముస్తాఫిజుర్ రెహ్మాన్ పరుగెత్తే సమయంలో ధోని అద్భుతమైన రన్ అవుట్ చేసి భారత్‌కు ఒక్క పరుగుతో విజయం అందించాడు.

ఈ ఉత్కంఠభరితమైన మ్యాచ్ తర్వాత బంగ్లాదేశ్ ఆటగాళ్లు తీవ్ర నిరాశకు గురయ్యారు. ఆ మ్యాచ్‌ని గుర్తుచేసుకున్న మహ్ముదుల్లా..“ఆ మ్యాచ్‌లో ఏమి జరిగిందో ఇప్పటికీ అర్థం కావడం లేదు. అది చాలా విషాదకరం. మేమంతా మైదానంలోనే ఏడ్చాం. హోటల్‌కు వెళ్లాక కూడా నేను, ముష్ఫికుర్ రహీమ్ సహా చాలా మంది ఏడ్చాం. ఎందుకంటే మేము భారత్‌ను ఓడించడానికి చాలా దగ్గరికి వచ్చాం అని చెప్పారు.

Also Read:హైదరాబాద్‌లో నెట్‌ఫ్లిక్స్‌ ఐలైన్‌ స్టూడియోస్‌

అయితే ఆ ఓటమి తన జీవితంలో పెద్ద పాఠం నేర్పిందని కూడా తెలిపారు. చివరి బంతి వరకు మ్యాచ్ తీసుకెళ్తే, దాన్ని పూర్తిగా ముగించాలి. ఆ సమయంలో ఒక బౌండరీ కొడితే సరిపోతుందని అనుకున్నాను. నిజం చెప్పాలంటే అది చాలా మూర్ఖమైన ఆలోచన అని అన్నారు. తాను ఎప్పుడూ నాలుగో లేదా ఐదో స్థానంలో బ్యాటింగ్ చేయాలని కోరుకున్నానని చెప్పారు. కానీ జట్టు అవసరాల వల్ల తరచుగా తన బ్యాటింగ్ ఆర్డర్ మారేదని తెలిపారు. బంగ్లాదేశ్ జట్టుకోసం బ్యాటింగ్ స్థానంలో నేను చేసిన త్యాగం చాలా ఎక్కువ. కానీ జట్టు విజయం సాధిస్తే అదే నాకు సంతోషం. అందుకే నేను ఎప్పుడూ ఫిర్యాదు చేయలేదు అని మహ్ముదుల్లా చెప్పారు.

- Advertisement -