మొజ్తబా ఖమేనీపై నెతన్యాహు సంచలనం!

5
- Advertisement -

ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీపై సంచలన కామెంట్స్ చేశారు ఇజ్రాయెల్ నెతన్యాహు. మొజ్తబా ఖమేనీకి ఎలాంటి లైఫ్ ఇన్సూరెన్స్ లేదు అని వ్యాఖ్యానించారు. ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

ఇరాన్‌తో పెరుగుతున్న యుద్ధ పరిస్థితుల మధ్య గురువారం మాట్లాడిన నేతన్యాహూ, అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్త సైనిక చర్యలు ఊహించిన దానికంటే మెరుగ్గా సాగుతున్నాయి అని అన్నారు. ఈ దాడుల వల్ల ఇజ్రాయెల్ మరింత బలంగా మారిందని తెలిపారు.

మొజ్తబా ఖమేనీ లేదా హెజ్బొల్లా నేత నయిమ్ ఖాసీమ్‌పై ఇజ్రాయెల్ దాడి చేస్తుందా అని ప్రశ్నించగా “టెర్రర్ సంస్థల నాయకుల్లో ఎవరిపైనా నేను లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోను” అని ఆయన సమాధానమిచ్చారు.

ఇరాన్‌లో ప్రభుత్వ మార్పు గురించి మాట్లాడిన నేతన్యాహూ..ఇరాన్ ప్రజలు ఆ నియంతృత్వ పాలనను తొలగించుకునే పరిస్థితులను సృష్టించడానికి మేము ప్రయత్నిస్తున్నాం అని చెప్పారు. మీరు స్వేచ్ఛ వైపు కొత్త మార్గం ప్రారంభించే సమయం దగ్గరలోనే ఉంది. మేము మీతో ఉన్నాం, మీకు సహాయం చేస్తున్నాం. కానీ చివరికి నిర్ణయం మీ చేతుల్లోనే ఉంది అన్నారు.

Also Read:హైదరాబాద్‌లో నెట్‌ఫ్లిక్స్‌ ఐలైన్‌ స్టూడియోస్‌

- Advertisement -