జమ్మూకాశ్మీర్ టెర్రర్ ఫండింగ్ కేసులో కాశ్మీరీ వేర్పాటువాది నాయకుడు షబీర్ అహ్మద్ షాకు సుప్రీం కోర్టు బెయిల్ మంజూరు చేసింది. బుధవారం ఈ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. కోర్టు పేర్కొన్నదేమిటంటే, బెయిల్‌కు సంబంధించిన పూర్తి నిబంధనలు మరియు షరతులతో కూడిన వివరణాత్మక ఉత్తర్వులు త్వరలో విడుదల చేస్తామని స్పష్టం చేసింది. ఆ ఉత్తర్వుల్లో పేర్కొనే షరతులను పాటించిన తరువాతే షబీర్ అహ్మద్ షా విడుదల అవుతారని కోర్టు తెలిపింది.
జమ్మూకాశ్మీర్‌లో ప్రముఖ వేర్పాటువాద నాయకుడిగా గుర్తింపు పొందిన షబీర్ అహ్మద్ షా గత కొన్ని సంవత్సరాలుగా టెర్రర్ ఫండింగ్ ఆరోపణలను ఎదుర్కొంటున్నారు. లోయలో వేర్పాటువాద కార్యకలాపాలకు ఆర్థిక సహాయం అందించినట్లు ఆయనపై కేసులు నమోదయ్యాయి. ఈ కేసులో ఆయనపై దర్యాప్తు కొనసాగుతుండగా, ప్రస్తుతం సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేయడం ముఖ్య పరిణామంగా భావిస్తున్నారు.
Also Read:ప్రజల కోరిక మేరకే ‘కేరళం’గా మార్పు!
బెయిల్ మంజూరు చేసినప్పటికీ, కోర్టు నిర్ణయించిన షరతులను తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుందని న్యాయస్థానం స్పష్టం చేసింది. త్వరలో విడుదలయ్యే పూర్తి ఉత్తర్వుల్లో ఆ షరతులన్నీ వివరంగా పేర్కొనబడనున్నాయి.

