బీజేపీ నేతలపై తెలంగాణ మంత్రి సీతక్క తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్లమెంటులో రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్క్ను బీజేపీ అవమానించిందని ఆమె ఆరోపించారు. మతం, కులాలను రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగిస్తూ దేశంలో విద్వేషాలు సృష్టిస్తున్న పార్టీ బీజేపీ అని విమర్శించారు.
బీజేపీ నేత బండి సంజయ్‌పై కూడా సీతక్క మండిపడ్డారు. బండి సంజయ్ నోరు తెరిస్తే విద్వేషపూరితమైన మాటలే వస్తాయని, సమాజంలో విభేదాలు పెంచేలా వ్యాఖ్యలు చేస్తున్నారని అన్నారు.
దేశ రాజ్యాంగాన్ని తొలగించాలని, రద్దు చేయాలని బీజేపీ కుట్ర చేస్తోందని కూడా ఆమె ఆరోపించారు. దేశంలోని అనేక రాష్ట్ర ప్రభుత్వాలను కూల్చేసిన చరిత్ర బీజేపీదేనని విమర్శించారు.
Also Read:వార్ ఎఫెక్ట్..యూరియాపై కూడా!
అదే సమయంలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కుటుంబాన్ని ప్రస్తావిస్తూ, దేశం కోసం ప్రాణ త్యాగాలు చేసిన చరిత్ర ఆ కుటుంబానికి ఉందని అన్నారు. రాహుల్ గాంధీ ఆకాశంలో ఉన్న నాయకుడు అయితే, బండి సంజయ్ పాతాళంలో ఉన్నారని గుర్తుంచుకోవాలి అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

