న్యూయార్క్ ఫెడరల్ కోర్టులో ట్రంప్‌కు ఎదురుదెబ్బ

2
- Advertisement -

అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌కు న్యూయార్క్ ఫెడరల్ కోర్టులో పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. గతంలో ఆయన ప్రభుత్వం విధించిన టారిఫ్‌లపై కీలక తీర్పు వెలువడింది.

న్యూయార్క్ ఫెడరల్ కోర్టు న్యాయమూర్తి ఇచ్చిన ఆదేశాల ప్రకారం, ఇప్పటివరకు వసూలు చేసిన సుంకాల రూపంలో వచ్చిన మొత్తాన్ని సంబంధిత కంపెనీలకు తిరిగి చెల్లించాలని ప్రభుత్వం కు సూచించారు. ఈ టారిఫ్‌ల వసూళ్లు చట్టబద్ధంగా లేవని కోర్టు అభిప్రాయపడింది.

ఇక ఇప్పటికే ఆ దేశ సుప్రీం కోర్టు కూడా ట్రంప్ విధించిన టారిఫ్‌లు రాజ్యాంగానికి విరుద్ధమని స్పష్టం చేసింది. ప్రపంచ దేశాలపై అధిక సుంకాలు విధించడం చట్టానికి అనుకూలం కాదని సుప్రీంకోర్టు తన తీర్పులో పేర్కొంది.

అయితే సుప్రీంకోర్టు తీర్పు వెలువడిన వెంటనే ట్రంప్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. తీర్పు వెల్లడైన కొన్ని గంటల్లోనే ప్రపంచ దేశాల నుంచి దిగుమతయ్యే వస్తువులపై 10 శాతం సుంకాలు విధించారు.

Also Read:పొట్ట చుట్టూ..కొవ్వు ఎందుకు పెరుగుతుంది?

అంతేకాకుండా తాజాగా ఆ సుంకాలను మరింత పెంచుతూ 15 శాతానికి పెంచినట్లు ప్రకటించారు. ఈ నిర్ణయం అమెరికా వాణిజ్య రంగంలోనే కాక ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో కూడా చర్చనీయాంశంగా మారింది.

ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయం చట్టపరమైన వివాదాలకు దారితీయవచ్చని నిపుణులు భావిస్తున్నారు. ఇక కోర్టు తీర్పుల నేపథ్యంలో అమెరికా ప్రభుత్వం తదుపరి ఏ నిర్ణయం తీసుకుంటుందన్నది ఆసక్తికరంగా మారింది.

- Advertisement -