ఐసీసీ టీ20 వరల్డ్ కప్ సెమీ ఫైనల్స్‌కు మ్యాచ్ అధికారుల జాబితాను ఐసీసీ ప్రకటించింది. మార్చి 4 మరియు 5 తేదీల్లో ఈ రెండు కీలక సెమీ ఫైనల్ మ్యాచ్‌లు జరగనున్నాయి.
నాకౌట్ దశకు చేరుకున్న టోర్నీలో తొలి సెమీ ఫైనల్‌లో న్యూజిలాండ్–దక్షిణాఫ్రికా జట్లు తలపడనున్నాయి. రెండో సెమీ ఫైనల్‌లో భారత్–ఇంగ్లండ్ జట్లు పోటీపడనున్నాయి. మార్చి 4న మొదటి సెమీ ఫైనల్, మార్చి 5న రెండో సెమీ ఫైనల్ నిర్వహించబడుతుంది.
సెమీ ఫైనల్–1 (మార్చి 4, కోల్‌కతా)
Eden Gardens వేదికగా దక్షిణాఫ్రికా–న్యూజిలాండ్ మ్యాచ్ జరగనుంది.
ఆన్-ఫీల్డ్ అంపైర్లు: రిచర్డ్ ఇల్లింగ్‌వర్త్ & అలెక్స్ వార్ఫ్
తృతీయ అంపైర్: నితిన్ మేనన్
నాలుగో అంపైర్: రాడ్ టక్కర్
మ్యాచ్ రిఫరీ: జావగల్ శ్రీనాథ్
సెమీ ఫైనల్–2 (మార్చి 5, ముంబై)
Wankhede Stadium లో భారత్–ఇంగ్లండ్ మ్యాచ్ జరగనుంది.
ఆన్-ఫీల్డ్ అంపైర్లు: క్రిస్ గాఫనీ & అల్లాహుద్దీన్ పాలేకర్
తృతీయ అంపైర్: అడ్రియన్ హోల్డ్‌స్టాక్
నాలుగో అంపైర్: పాల్ రీఫెల్
మ్యాచ్ రిఫరీ: ఆండీ పైక్రాఫ్ట్
Also Read:దేవరకొండ ట్రస్ట్ ద్వారా విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు
ఈ రెండు మ్యాచ్‌లకు అనుభవజ్ఞులైన అధికారులను ఐసీసీ నియమించడంతో పోటీలు మరింత ఉత్కంఠభరితంగా సాగనున్నాయి.

