- Advertisement -
ఖమ్మం వెలుగుమట్లలో పేదల ఇండ్ల కూల్చివేతలపై తీవ్ర విమర్శలు చేశారు కేరళ సీఎం పినరయి విజయన్. తెలంగాణలో బుల్డోజర్ రాజ్యం నడుస్తుంది అని ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.
ఖమ్మంలో కాంగ్రెస్ ప్రభుత్వం 700 ఇళ్లను కూల్చివేసి, 3,000 మందిని నిరాశ్రయులను చేసింది అన్నారు. బీజేపీ మోడల్ బుల్డోజర్ రాజ్యాన్ని తెలంగాణలో కాంగ్రెస్ అనుసరిస్తుంది …తెలంగాణలో అణగారిన వర్గాలపై కాంగ్రెస్ చేస్తున్న దాడులకు సమాధానం చెప్పాలి అన్నారు.
తెలంగాణలో అణగారిన వర్గాల ఇండ్లను కూల్చి, కేరళలో ప్రజలతో నిలబడతామని కాంగ్రెస్ చెప్పడం అవమానం అని పేర్కొన్నారు.

- Advertisement -

