F-15 యుద్ధ విమానాన్ని కూల్చేసిన ఇరాన్

6
- Advertisement -

ఇరాన్–అమెరికా మద్దతున్న ఇజ్రాయెల్ మధ్య యుద్ధం మూడో రోజుకు చేరుకున్న వేళ, ఒక ఎఫ్-15 యుద్ధవిమానం కువైట్ ఆకాశంలో అగ్నికి ఆహుతై కూలిపోయిందని ఇరాన్ సోమవారం ప్రకటించింది. సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోలో విమానం వెనుక భాగంలో మంటలు చెలరేగుతూ నెమ్మదిగా కిందికి పడిపోతున్న దృశ్యాలు కనిపించాయి.

అయితే అది అమెరికా లేదా ఇజ్రాయెల్‌కు చెందినదో స్పష్టత లేదు. కొంత సమాచారం ప్రకారం ఇది ‘ఫ్రెండ్లీ ఫైర్’ కావచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇద్దరు పైలట్లు సురక్షితంగా బయటపడినట్లు వార్తలు వెలువడ్డాయి. కువైట్‌లోని అమెరికా ఎంబసీ సమీపంలో పొగలు ఎగిసినట్లు ఏఎఫ్‌పీ తెలిపింది. అమెరికా, ఇజ్రాయెల్ ఈ ఘటనను ఇంకా ధృవీకరించలేదు.

ఇక టెహ్రాన్‌లో శనివారం జరిగిన క్షిపణి దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మరణించినట్లు నివేదికలు పేర్కొన్నాయి. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సోషల్ మీడియాలో స్పందిస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

గత 72 గంటల్లో రెండు పక్షాల దాడులు తీవ్రరూపం దాల్చాయి. టెల్ అవీవ్, జెరూసలేం ప్రాంతాల్లో పేలుళ్లు వినిపించాయి. గల్ఫ్ ప్రాంతాల్లో కూడా ఉద్రిక్తతలు పెరిగాయి. దుబాయ్ విమానాశ్రయం కొంతసేపు మూతపడగా, ఓ లగ్జరీ హోటల్ క్షిపణి దాడికి గురైంది. మినాబ్ పట్టణంలోని పాఠశాలపై దాడిలో 160 మందికి పైగా మృతి చెందినట్లు ఇరాన్ ఆరోపించింది. ఇప్పటివరకు 200కి పైగా ప్రాణనష్టం జరిగినట్లు సమాచారం, అయితే అసలు సంఖ్య మరింత ఎక్కువగా ఉండవచ్చని మానవ హక్కుల సంస్థలు హెచ్చరిస్తున్నాయి.

https://x.com/ndtv/status/2028343633825649055?

- Advertisement -