ప్రస్తుతం జరుగుతున్న 2026 టీ20 వరల్డ్ కప్‌లో పాకిస్థాన్ జట్టు నాకౌట్ దశకు అర్హత సాధించాలంటే కీలక మ్యాచ్ ఆడాల్సి ఉంది. టోర్నమెంట్‌లో 50వ మ్యాచ్‌గా పాకిస్థాన్ ఫిబ్రవరి 28న పల్లెకెల్లే అంతర్జాతీయ స్టేడియంలో శ్రీలంకతో తలపడనుంది. ప్రస్తుతం సూపర్ 8 గ్రూప్‌లో పాకిస్థాన్ మూడో స్థానంలో ఉంది.
న్యూజిలాండ్‌ను అధిగమించి నాకౌట్ దశకు చేరుకోవాలంటే పాకిస్థాన్ శ్రీలంకపై కనీసం 65 పరుగుల తేడాతో గెలవాలి లేదా లక్ష్యాన్ని 13 ఓవర్లలో చేధించాలి. అలా జరిగితే పాకిస్థాన్ గ్రూప్‌లో రెండో స్థానంతో సెమీఫైనల్‌కు అర్హత సాధిస్తుంది.
ఇప్పటికే గ్రూప్ దశలో భారత్–పాకిస్థాన్ తలపడగా, టీమ్ ఇండియా విజయం సాధించింది. అయితే పాకిస్థాన్ నాకౌట్‌కు చేరి, భారత్ తమ సూపర్ 8 గ్రూప్‌లో అగ్రస్థానంలో నిలిస్తే, ఇరు జట్లు సెమీఫైనల్లో మళ్లీ తలపడే అవకాశం ఉంది. మరో అవకాశంగా, ఇరు జట్లు తమ తమ సెమీఫైనల్ మ్యాచ్‌లు గెలిస్తే ఫైనల్లో మరోసారి భారత్–పాకిస్థాన్ పోరు జరగవచ్చు.
ప్రస్తుతం పాకిస్థాన్ రెండు మ్యాచ్‌లలో ఒక పాయింట్‌తో మూడో స్థానంలో ఉండగా, న్యూజిలాండ్ మూడు మ్యాచ్‌లలో మూడు పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. శ్రీలంక ఇప్పటికే టోర్నమెంట్ నుంచి తప్పుకుంది.
Also Read:కనకదుర్గమ్మ సన్నిధిలో మంత్రి కోమటిరెడ్డి

