శారద పీఠాన్ని కూల్చేందుకు రేవంత్ కుట్ర

8
- Advertisement -

కోకాపేటలో మైనింగ్ అంశం రాజకీయంగా దుమారం రేపుతోంది. 10 ఎకరాలు కేటాయించినా, భాగ్యలక్ష్మి మినరల్స్ అండ్ మైనింగ్ సంస్థ 17 ఎకరాలు ఆక్రమించిందని బీఆర్‌ఎస్ నేత హరీష్‌ రావు ఆరోపించారు. HMDA సూచనల ప్రకారం ఓఆర్ఆర్ కి కిలోమీటర్ లోపల మైనింగ్ చేయకూడదని ఉన్నప్పటికీ, ఆ నిబంధనలు పట్టించుకోలేదని విమర్శించారు.

భాగ్యలక్ష్మి మినరల్స్ అండ్ మైనింగ్ వెనుక సీఎం రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యుల ప్రమేయం ఉందని హరీష్ రావు ఆరోపించారు. రమేష్ రెడ్డి, దీపక్ రెడ్డి, కౌశిక్ రెడ్డి పేర్లు ప్రస్తావిస్తూ, ఈ క్రషర్ కార్యకలాపాలపై సమగ్ర దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు. వాటర్ వెల్స్ కోసం ఇచ్చిన భూమి పనికిరాదా? శారద పీఠం భూమే ఎందుకు లక్ష్యమైందని ప్రశ్నించారు.

శారద పీఠాన్ని కూల్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర పన్నుతోందని హరీష్ రావు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నిత్య అన్నదానం, వేద పాఠశాల, గోశాల, ఆలయం వంటి సేవా కార్యక్రమాలు జరుగుతున్న పీఠాన్ని ఎందుకు తొలగించాలని చూస్తున్నారని ప్రశ్నించారు. కేసీఆర్ నిర్మించిన దేవాలయాలపై కూడా చర్యలు తీసుకుంటారా? కూల్చడమే పాలనా విధానమా? అంటూ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈ ఆరోపణలపై ప్రభుత్వం నుంచి అధికారిక స్పందన రావాల్సి ఉంది.

Also Read:Ind Vs Wi:మ్యాచ్‌ వర్షం కారణంగా రద్దయితే?

- Advertisement -