సోషల్ మీడియా రంగంలో సంచలన నిర్ణయం వెలువడింది. Twitter సహ వ్యవస్థాపకుడు జాక్ డోర్సే తమ కంపెనీలో 4000 మందికిపైగా ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించారు. ఈ ప్రకటనతో టెక్ రంగంలో మరోసారి ఉద్యోగ భద్రతపై చర్చ మొదలైంది.
అయితే ఈ నిర్ణయం ఆర్థిక బలహీనత కారణంగా కాదని జాక్ డోర్సే స్పష్టం చేశారు. కంపెనీ ప్రస్తుతం ఎలాంటి సంక్షోభంలో లేదని, వ్యాపారం బలంగానే కొనసాగుతోందని తెలిపారు. అంతేకాకుండా లాభాలు కూడా పెరుగుతున్నాయని పేర్కొన్నారు. సంస్థ భవిష్యత్తు వ్యూహాల్లో మార్పులు, పనితీరులో సమర్థత పెంపు, ఖర్చుల నియంత్రణ వంటి అంశాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.
ప్రస్తుతం X పేరుతో కొనసాగుతున్న ఈ సంస్థలో పునర్వ్యవస్థీకరణ ప్రక్రియ జరుగుతోందని తెలిపారు. టెక్నాలజీ రంగంలో వేగంగా మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా కంపెనీ నిర్మాణంలో మార్పులు అవసరమయ్యాయని చెప్పారు. ఉద్యోగుల తొలగింపుపై బాధ ఉన్నప్పటికీ, దీర్ఘకాల వృద్ధిని దృష్టిలో ఉంచుకుని తీసుకున్న కఠిన నిర్ణయమని జాక్ డోర్సే పేర్కొన్నారు.
Also Read:ఒత్తిడితో పురుషుల్లో సంతానోత్పత్తి సమస్య..!

