న్యాయవ్యవస్థపై వివాదాస్పద అధ్యాయం ఉన్న NCERT సోషల్ సైన్స్ పుస్తకంపై సుప్రీంకోర్టు పూర్తి నిషేధం విధించింది. ‘న్యాయవ్యవస్థలో అవినీతి’ అనే అధ్యాయం కలిగిన ఆ పుస్తకాన్ని అందుబాటులో ఉంచకూడదని కోర్టు ఆదేశించింది. ఈ వ్యవహారంపై పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి, ఎన్‌సీఈఆర్‌టీ డైరెక్టర్ దినేష్ ప్రసాద్ సక్లానీకి షోకాజ్ నోటీసులు జారీ చేసింది.
‘న్యాయవ్యవస్థలో అవినీతి’ అధ్యాయాన్ని రచించినవారు ఇకపై యూజీసీ లేదా ఏ మంత్రిత్వ శాఖతోనూ పనిచేయరని. సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతా సువో మోటు కేసులో మేము నిఃశర్త క్షమాపణ కోరుతున్నాం అని తెలిపారు.
అయితే ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ స్పందిస్తూ…మీడియా ద్వారా వచ్చిన నోటీసులో ఒక్క క్షమాపణ మాట కూడా లేదు అని వ్యాఖ్యానించారు. 32 పుస్తకాలు ఇప్పటికే అమ్ముడయ్యాయని, ఇప్పుడు ఉపసంహరించుకున్నామని ప్రభుత్వం తెలిపినప్పటికీ, ఇది ఉద్దేశపూర్వక చర్య అని సీజేఐ అభిప్రాయపడ్డారు. భారత న్యాయవ్యవస్థ అవినీతిగ్రస్తమని బోధించడం ఒక లోతైన కుట్ర అని వ్యాఖ్యానించారు.
ఆ అధ్యాయంలో న్యాయవ్యవస్థలో అవినీతి, పెండింగ్ కేసుల భారీ సంఖ్య, తగినంత న్యాయమూర్తుల కొరత వంటి సవాళ్లను ప్రస్తావించారు. సుప్రీంకోర్టులో సుమారు 81 వేల కేసులు, హైకోర్టుల్లో 62.40 లక్షలు, జిల్లా కోర్టుల్లో 4.70 కోట్లు పెండింగ్‌లో ఉన్నాయని పేర్కొన్నారు.
Also Read:Modi:ప్రధాని మోదీ అరుదైన ఘనత..

