కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై తీవ్ర విమర్శలు చేశారు సీనియర్ కాంగ్రెస్ నేత మణిశంకర్ అయ్యర్. ఇండియా కూటమి (INDIA bloc) నాయకత్వం నుంచి రాహుల్ గాంధీ తప్పుకోవాలని సూచించారు. ఆయన స్థానంలో ప్రాంతీయ పార్టీల ప్రముఖ నేతలను ముందుకు తేవాలని అభిప్రాయపడ్డారు.
మమతా బెనర్జీ, అఖిలేశ్ యాదవ్, ఎం.కే. స్టాలిన్, తేజస్వి యాదవ్ వంటి నేతలు కూటమిని సమర్థవంతంగా నడిపించగలరని అయ్యర్ పేర్కొన్నారు. ఇటీవల కాంగ్రెస్కు ఎదురైన ఎన్నికల పరాజయాలను ప్రస్తావిస్తూ, ఈ నేతలు కూటమిని బలోపేతం చేయడానికి ఎక్కువ సమయం కేటాయించగలరని అన్నారు.
మమతా బెనర్జీని దూరం పెట్టడం వల్ల కాంగ్రెస్ బలహీనపడింది. రాహుల్ గాంధీ ఈ పదవిని పట్టుకోకుండా, స్టాలిన్, మమతా, అఖిలేశ్, తేజస్వి వంటి నేతలకు బాధ్యతలు అప్పగిస్తే కూటమి బలపడుతుంది అని అయ్యర్ వ్యాఖ్యానించారు. అయితే కాంగ్రెస్ నేత ఇమ్రాన్ మసూద్ స్పందిస్తూ, ఇండియా కూటమిని సమర్థంగా నడిపించగల నాయకుడు రాహుల్ గాంధీ మాత్రమేనని చెప్పారు. బీజేపీకి గట్టి పోటీ ఇవ్వగల సామర్థ్యం రాహుల్ గాంధీకే ఉందన్నారు.
ఇదే సమయంలో అయ్యర్ మరో వివాదాస్పద వ్యాఖ్య చేశారు.పినరయి విజయన్ మళ్లీ కేరళ ముఖ్యమంత్రిగా కొనసాగుతారని అన్నారు. విజన్ 2031: డెవలప్మెంట్ అండ్ డెమోక్రసీ సదస్సులో మాట్లాడుతూ, కేరళలో పంచాయతీ రాజ్ వ్యవస్థను మరింత బలోపేతం చేయడానికి చట్ట సవరణలు చేయాలని సూచించారు.
Also Read:దేవుడికి మహాపచారం..అసెంబ్లీలోనే బయటపెడతాం!

